Mimicry musical instruments : మిమిక్రీతో అదరగొట్టాడు.. సంగీత వాయిద్యంతో ఎన్నో రకాల శబ్దాలు..

చాలా మందిలో అంతర్గతంగా ఎన్నో నైపుణ్యాలు ఉంటాయి.ఎప్పుడైనా వాటిని బయటపెట్టినప్పుడు వారి ప్రతిభను చూసి అంతా ఆశ్చర్యపోతుంటారు.

సోషల్ మీడియా ప్రస్తుతం విస్తృత ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఎందరో ప్రతిభావంతుల నైపుణ్యలు బయటపడుతున్నాయి.వాటిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

With Mimicry Many Kinds Of Sounds With Musical Instrument. Mimicry, Musical Inst

రకరకాల టాలెంట్లు చాలా మందిలో దాగి ఉంటాయి.కొందరు తమలోని వంట నైపుణ్యం ఉంటుంది.

ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి తమలో ఉండే పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని బయట పెడుతున్నారు.మరికొంత మంది డ్యాన్స్ ద్వారా ఫేమస్ అవుతున్నారు.

Advertisement

ఇలా ఒక్కొక్కరు తమలోని ఒక్కో నైపుణ్యంతో పేరు సంపాదిస్తున్నారు.ఇదే కోవలో ఓ వ్యక్తిలోని మిమిక్రీ ప్రతిభను చూసి ఓ మాజీ ఐపీఎస్ అధికారి ఆశ్చర్యపోయారు.

అతడి వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వీడియోను మాజీ ఐపీఎస్ అధికారి కె.వెంకటేశం పోస్ట్ చేశారు.అందులో ఓ వ్యక్తి సంగీత వాయిద్య పరికరాలను విక్రయిస్తూ ఉంటాడు.

ఒక పరికరాన్ని తీసుకున్ని మొదట అతడు పక్షులు, జంతువులు ఇలా రకరకాలుగా మిమిక్రీ చేస్తాడు.ఆ చిన్న పరికరంతోనే ఆశ్చర్యకరంగా పోలీసుల జీపుల తరహాలో సైరన్ మోగిస్తాడు.

బియ్యం పిండిని ఇలా వాడితే బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా మిలమిల మెరుస్తారు

అంతలోనే 108 వాహనం లాగా సౌండ్ చేస్తాడు.ఇలా ఒక చిన్న పరికరంతోనే రకరకాల శబ్ధాలు చేస్తాడు.

Advertisement

చివరికి కుక్క భౌ భౌ అన్నట్లు దానిలా కూడా శబ్ధాలు చేస్తాడు.ఈ వీడియోను పోస్ట్ చేసిన మాజీ ఐపీఎస్ అధికారి వెంకటేశం దానికి ప్రతిభకు హద్దు లేదు అని క్యాప్షన్ పెట్టారు.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా అతడి ప్రతిభను మెచ్చుకుంటున్నారు.సంగీత పరికరంతో అన్ని రకాలుగా మిమిక్రీ చేయడం తామెక్కడా చూడలేదని ఆ వ్యక్తి నైపుణ్యానికి ఆశ్చర్యపోతున్నారు.

తాజా వార్తలు