రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇచ్చే ప్రకటనలను మీరు చూసే ఉంటారు.రకరకాల ప్రకటనలను అవి గుప్పిస్తుంటాయి.
ప్రజలను ఆకట్టుకునేందుకు ఎన్నో రకాల ఆఫర్లను ఇస్తుంటాయి.తాజాగా న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరం శివారులో ఓ ఏడు పడక గదుల ఇల్లు అమ్మకానికి వచ్చింది.
అక్కడ ఇల్లు కొన్న వారికి రియల్ ఎస్టేట్ కంపెనీ బంపరాఫర్ ప్రకటించింది.ఇల్లు కొన్న వారికి ఉచితంగా టెస్లా కారు ఇస్తామని ప్రకటించింది.
ఇది చూసిన ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారు.చక్కటి ఇల్లు కొంటే దానికి మించి కారు ఫ్రీగా ఇస్తామని చెప్పడంతో ఆకర్షితులవుతున్నారు.
దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
ఆక్లాండ్‌లోని ఏడు పడక గదుల ఇళ్లను రియల్ ఎస్టేట్ ఏజెంట్లు బార్‌ఫూట్, థాంప్సన్ ఇటీవల విక్రయానికి ఉంచారు.
ఆ ఇంటిని కొనుగోలు చేసిన వారికి టెస్లా మోడల్ Y కారును ఉచితంగా ఇవ్వబడనున్నట్లు తెలిపారు.ఆ ద్వీప దేశంలో అధిక తనఖా రేట్లు కారణంగా గృహ కొనుగోలుదారులు పెట్టుబడి కోసం నిరుత్సాహపడ్డారు.
రియల్ ఎస్టేట్ పడిపోతోంది.దీంతో ఆ దేశంలో రెసిడెన్షియల్ ఇళ్ల ధరలు గణనీయంగా తగ్గిపోతున్నాయి.
కొనే వారు కూడా తగ్గిపోతున్నారు.ఈ తరుణంలో ప్రజలను ఆకర్షించేందుకు ఇలా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

తాజాగా ప్రకటించిన ఆఫర్ కూడా అలాంటిదే.కొనుగోలుదారులు తమకు నచ్చిన రంగులో మోడల్ Y టెస్లాను పొందుతారు.న్యూజిలాండ్‌లో మోడల్ ధర $78,243గా ఉంది.ఆ ఇల్లు కొనుగోలు చేసిన వారికి బోనస్‌గా టెస్లా కారు అందుతుంది.రియల్ ఎస్టేట్ ఏజెంట్లు బార్‌ఫూట్, థాంప్సన్ ప్రకటనతో ఆ ఇంటిని కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.ఇలాంటి ప్రకటనలతో మరింత మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఇదే తరహాలో ఆఫర్లు ఇస్తున్నారు.
నిస్తేజంగా ఉన్న ఇళ్లు, ఇతర ప్రాపర్టీల క్రయవిక్రయాలు పెంచే దిశగా కృషి చేస్తున్నారు.







