జనసేన పొత్తుతో తెలంగాణ బీజేపీలో చిచ్చు..!!

తెలంగాణలో జనసేన పొత్తుతో బీజేపీలో చిచ్చు రాజుకుంది.జనసేనకు సీట్ల కేటాయింపుల నేపథ్యంలో బీజేపీ నేతల్లో అలకలు, అసంతృప్తులు ఎక్కువ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.శేరిలింగంపల్లి, తాండూరు సీట్లను జనసేనకు కేటాయించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఈ క్రమంలో పార్టీకి నష్టం వాటిల్లుతుందంటూ ఆయన ఢిల్లీకి పయనం అయ్యారు.తాండూరు, శేరిలింగంపల్లి రెండూ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి.

ఈ క్రమంలో చేవెళ్లలో బీజేపీ జెండా ఎగరాలంటే తాండూరు, శేరిలింగంపల్లి స్థానాలు కీలకమని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెబుతున్నారు.ఢిల్లీకి వెళ్లిన ఆయన ఈ విషయాన్ని పార్టీ అధిష్టానానికి వివరించనున్నారని తెలుస్తోంది.

Advertisement
పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు