వారెంట్ లేకుండా సెర్చ్‌ , ఆపై బెదిరింపులు : పోలీస్ అధికారిపై దావా వేసిన భారత సంతతి కార్మికుడు

కెనడియన్ రాష్ట్రం మానిటోబాలో( Manitoba ) భారత సంతతికి చెందిన రిటైల్ వర్కర్‌( Retail Worker ) వారెంట్ లేకుండా తన ఇంటిని సెర్చ్ చేయడమే కాకుండా బహిష్కరిస్తానని బెదిరించిన ఒక పోలీస్ అధికారిపై దావా వేశాడు.సార్జెంట్ అవెన్యూ కన్వీనియన్స్ స్టోర్స్‌లో క్యాషియర్ అయిన హర్జోత్ సింగ్( Harjot Singh ) శుక్రవారం (జనవరి 5)న సీబీసీ టెలివిజన్‌ ప్రతినిధితో మాట్లాడుతూ.

 Winnipeg Police Officer Misconduct With Indian Retail Worker Details, Indian-ori-TeluguStop.com

విన్నిపెగ్( Winnipeg ) పోలీస్ విభాగానికి చెందిన అధికారి జెఫ్రీ నార్మణ్( Jeffrey Norman ) చర్యలు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయన్నారు.పోలీస్ అధికారిని అడ్డుకున్నందుకు గాను తన మొబైల్‌ను లాక్కొని, చేతికి సంకెళ్లు వేసి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

Telugu Canada, Threats, Forced Quit Job, Harjot Singh, Indian Origin, Jeffrey No

మానిటోబా కోర్ట్ ఆఫ్ కింగ్స్( Manitoba Court of Kings ) బెంచ్‌లో గత నెల చివరిలో దాఖలు చేసిన దావా ప్రకారం.గతేడాది డిసెంబర్ 2న హర్జోత్ సింగ్ దుకాణం తాత్కాలికంగా మూసివేశారు.ఆ సమయంలో పోలీస్ అధికారి నార్మణ్ ఆ షాపులోకి బలవంతంగా ప్రవేశించడానికి యత్నించాడు.కాసేపటి తర్వాత సింగ్ తలుపులు తీయగా.నార్మణ్ ఎలాంటి వారెంట్( Warrant ) లేకుండా ఆ ప్రదేశంలో తనిఖీలు చేశాడు.సింగ్‌ను నార్మణ్ విచారించగా.

ఇందుకు సహకరించని పక్షంలో కెనడా నుంచి బహిష్కరిస్తానని బెదిరించాడు.దీనిపై భయాందోళనలకు గురైన హర్జోత్ సింగ్ .దుకాణంలో తన ఉద్యోగాన్ని వదిలేశాడు.

Telugu Canada, Threats, Forced Quit Job, Harjot Singh, Indian Origin, Jeffrey No

దావాలోని క్లెయిమ్‌లలో ఏవీ ఇంకా కోర్టులో రుజువుకానప్పటికీ .ఆ అధికారి ప్రవర్తన సమంజసంగా లేదన్నారు.జైలుశిక్ష, ఏకపక్ష నిర్బంధం, శోధనలు సింగ్ హక్కులను ఉల్లంఘించడమేనని దావాలో పేర్కొన్నారు.

రాజ్యాంగబద్ధమైన, శిక్షార్హమైన నష్టపరిహారంగా నిర్వచించబడని మొత్తాన్ని కోరడంతో పాటు విన్నిపెస్ పోలీస్ సర్వీస్ కోసం రెమిడియల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను అభివృద్ధి చేయడానికి విన్నిపెగ్ నగర పరిపాలనా యంత్రాంగాన్ని ఆదేశించాలని న్యాయస్థానాన్ని దావాలో కోరారు.నార్మణ్, విన్నిపెగ్ నగరాన్ని ఈ దావాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube