మ్యాగీ నుంచి అద్భుతమైన ఆఫర్.. త్వరగా తెలుసుకోకపోతే నష్టపోతారంతే..

నెస్లే మ్యాగీ కొత్త సంవత్సరం సందర్భంగా సూపర్ బొనాంజా ఆఫర్‌ను ప్రకటించింది.ఈ ఆఫర్ కింద ప్రతి 30 నిమిషాలకు గోల్డ్ వోచర్లు గెలుచుకునే సువర్ణ అవకాశాన్ని ప్రజలకు అందిస్తోంది.అలా ప్రజలు రూ.9,999 విలువైన గోల్డ్ వోచర్‌ను సొంతం చేసుకోవచ్చు.Maggi 40 ఏళ్లుగా వినియోగదారుల జీవితాల్లో ఆనందం, సౌలభ్యాన్ని తీసుకొచ్చిందని నెస్లే ఇండియా అధికారి పేర్కొన్నారు.

 Win Gold Voucher With Maggi Super Bonanza Offer Details, Maggi, Maggi Bonanza, S-TeluguStop.com

మ్యాగీ పోర్ట్‌ఫోలియో అంతటా 15 కోట్ల ప్యాక్‌లపై ఈ ఆఫర్‌ని అందిస్తున్నామని చెప్పారు.

మ్యాగీ సూపర్ బొనాంజా జనవరి 2023లో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రతి కొనుగోలుదారుడికి అందుబాటులో ఉంటుంది.ఈ గోల్డ్ వోచర్లు సమీపంలోని స్టోర్‌లో Maggi ప్యాకెట్లు కొనుగోలు చేయడం ద్వారా గెలుచుకోవచ్చు.

గిఫ్ట్ వోచర్ లభించినట్లయితే తనిష్క్, జోయాలుక్కాస్, కళ్యాణ్ జ్యువెలర్స్, బ్లూస్టోన్ లలో ఆ వోచర్‌లను రీడీమ్ చేసుకోవచ్చు.

గోల్డ్ వోచర్‌ను 2023, ఫిబ్రవరి 10 తేదీలోగా రీడీమ్ చేసుకోవచ్చు.ఈ ఆఫర్ వూహూ మ్యాగీ సూపర్ బొనాంజా నుంచి వస్తోంది.మ్యాగీ ఎస్ఎంఎస్‌ పంపితే రూ.9,999 విలువైన బంగారాన్ని ఉచితంగా అందిస్తోంది.900 మంది విజేతలు ఈ గోల్డ్ వోచర్ సొంతం చేసుకోవచ్చు.ఈ ఆఫర్ చెల్లుబాటు 1 జనవరి 2023 నుంచి 10 ఫిబ్రవరి 2023 వరకు ఉంటుంది.

ఎస్ఎంఎస్‌ సమయం రోజూ ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది.ఎస్ఎంఎస్‌ ఫార్మాట్ చూసుకుంటే వినియోగదారులు గోల్డ్ లాట్ నం.6262642222కు ఎస్ఎంఎస్‌ చేయాలి.యూట్యూబ్‌లో ఈ ఆఫర్ కి సంబంధించి ఒక అడ్వర్టైజ్‌మెంట్ కూడా పోస్ట్ చేశారు.దాన్ని చెక్ చేయడం ద్వారా వినియోగదారులు పూర్తిస్థాయిలో క్లారిటీ పొందొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube