ఒక రాయి ఇప్పుడు జపాన్ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తుంది.రాయి ఏంటి.? దానిని చూసి జనాలు ఎందుకు వణికి పోతున్నారని ఆలోచిస్తున్నారా.? ఎందుకంటే ఆ రాయిని తాకిన జనాల ప్రాణాలు పోతున్నాయి కాబట్టి.ఆ రాయిని ఎవరయితే ముట్టుకుంటున్నారో వారు చనిపోతున్నారట.వినడానికి విచిత్రంగా ఉన్నాగాని అక్కడి ప్రజలు మాత్రం ఆ రాయిని చూసి భయపడుతున్నారు.వివరాల్లోకి వెళితే అది జపాన్‌లోని టోక్యోకు ఉత్తరం వైపున్న టొచిగి పర్వత ప్రాంతం.అక్కడి కొండల మధ్యలో ఓ పెద్ద రాయి ఉంది.
రాయే కదా అని అనుకుంటే పొరపాటు పడినట్లే.ఆ రాయికి చాలా చరిత్ర ఉందండోయ్.
ఆ రాయికి దాదాపు వెయ్యేళ్లనాటి చరిత్ర ఉంది.
వివరాల్లోకి వెళితే.
జపాన్ పురాణాల్లోని ఒక కధ ఈ రాయి గురించి ఏమి చెబుతుందంటే 1107–1123 సంవత్సరాల మధ్య జపాన్ ను పాలించిన టోబా చక్రవర్తిని కొందరు దుండగులు కుట్ర చేసి మరి చంపేశారు.అయితే టమామో నోమీ అనే ఓ మహిళా అప్పట్లో ఒక మంత్రగత్తె.
చక్రవర్తి మరణించిన తరువాత ఒక యుద్ధవీరుడు మంత్రగత్తే అయిన టమామోను చంపేయగా వెంటనే ఆమె మృతదేహం ఓ పెద్ద రాయిగా మారిపోయిందట.అప్పటి నుండి ఆ రాయిని ఎవరు తాకినా గాని చనిపోయేవారట.
అందుకే అప్పటి నుంచీ ఆ రాయిని ‘సెషో సెకి అంటే కిల్లింగ్ స్టోన్ గా పిలవడం మొదలుపెట్టారు.అందరూ కూడా ఆ రాయిలో మంత్రగత్తె ఆత్మ ఉందని భావించేవారట.
ఇకపోతే ఈ మధ్య కాలంలోనే ఈ రాయి రెండుగా విరిగిపోయింది.దాంతో అప్పటినుంచి ప్రజలుఅందరిలో ఆ దెయ్యపు మంత్రగత్తె ఆత్మ బయటికి వచ్చేసిందంటూ పుకార్లు మొదలయ్యాయి.ఇది అక్కడి సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.అలాగే రాయి చూడడానికి కూడా దాని మధ్యలోంచి ఏదో బయటికి వచ్చినట్టుగా పగిలిందంటూ మరికొందరు అంటున్నారు.ఇదేదో కీడుకు సంకేతంగా అనిపిస్తుందని ఇంకొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కానీ అక్కడి అధికారులు మాత్రం ఆ రాయికి కొన్నేళ్ల కిందే పగుళ్లు వచ్చాయని ఈ మధ్య పడిన భారీ వర్షాల కారణంగా రాయి విరిగి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
విచిత్రం ఏంటంటే.ఈ రాయి ఇప్పటిదాకా ఓ పర్యాటక ప్రాంతంలో ఉండేది.
ఆ ప్రాంతాన్ని చూడడానికి జనం బాగానే వచ్చేవారు.కానీ ఎప్పుడయితే రాయి విరిగిందని తెలిసిందో అప్పటినుంచి ఆ ప్రాంతానికి జనాలు రావడమే మానేశారు.