ప్రభాస్ ఫ్రెండ్షిప్ కి ఎంత వాల్యూ ఇస్తాడో తెలిస్తే షాక్ అవుతారు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఎందుకంటే ఆయన పాన్ ఇండియాలో తనదైన రీతిలో వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు.

ఇక ఇప్పుడు కల్కి,( Kalki ) రాజసాబ్( Rajasaab ) లాంటి వరుస సూపర్ డూపర్ సక్సెస్ లతో ముందుకు దూసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు కదులుతున్నాడు.ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ మొదటినుంచి కూడా ఫ్రెండ్షిప్ కి( Friendship ) చాలా వాల్యూ ఇస్తు వస్తున్నాడు అనే విషయం మనందరికీ తెలిసిందే.

ఇక నటుడు ప్రభాస్ శ్రీను( Prabhas Srinu ) విషయంలో ఆయన చాలావరకు తనకు హెల్ప్ చేసిన విషయం మనలో చాలామందికి తెలియదు.నిజానికి వీరిద్దరూ సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ కోర్సులో ఒకే బ్యాచ్ లో జాయిన్ అయ్యారు.అలా ప్రభాస్ తో శ్రీను చాలా క్లోజ్ అవ్వడం వల్ల తను ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నాడు.

ప్రభాస్ శీను చాలా వరకు అవకాశాల కోసం తిరిగినప్పటికీ పెద్దగా అవకాశాలు రాలేదు.ఇంకా ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయి ఏదైనా బిజినెస్ పెట్టుకుందామనే ప్లాన్ లో ఉన్నానని ప్రభాస్ తో చెప్పారట.

Advertisement

దానికి ప్రభాస్ ఇప్పుడు అలాంటి డిసీజన్స్ తీసుకోకు నాతో పాటు ట్రావెల్ అవ్వు అక్కడ నీకు కొన్ని పరిచయాలు పెరిగితాయి అలా సినిమాల్లో అవకాశాలు కూడా వస్తాయని చెప్పడంతో ప్రభాస్ డేట్స్ చూస్తూ ఉండేవాడు.అలా చాలామంది దర్శకులు పరిచయం అవడంతో చాలా సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి.ఇక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తను ఇండస్ట్రీలో మంచి నటుడిగా ఎదిగాడు.

ఇక ఇప్పటికి ప్రభాస్ లేకపోతే నేను ఇక్కడ ఉండే వాడిని కాదు అంటూ శ్రీను ప్రభాస్ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు.

Advertisement

తాజా వార్తలు