టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి పరిచయం అవసరం లేదు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్నటువంటి ఈయన పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా మారిపోయారు.ఇక అల్లు అర్జున్ త్వరలోనే పుష్ప 2 సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు.
ఇకపోతే అల్లు అర్జున్ తో సినిమా చేయడం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు డైరెక్టర్ శ్రీ కార్తీక్.శర్వానంద్ రీతు వర్మ జంటగా టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఒకే ఒక జీవితం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు డైరెక్టర్ శ్రీ కార్తీక్.
ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన ఒకే ఒక జీవితం సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా చూసిన పలువురు ఈయన ప్రతిభ పై ప్రశంసలు కురిపించారు.మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయం సొంతం చేసుకున్న శ్రీ కార్తిక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి వెల్లడించారు.
ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ఊహించుకొని ఈయన ఒక రియలిజం ఫాంటసీ నేపథ్యంలో ఒక అద్భుతమైన కథ సిద్ధం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఇలా అల్లు అర్జున్ కోసమే ప్రత్యేకంగా ఈయన స్క్రిప్ట్ తయారు చేసుకోవడమే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ తో చేయడం కోసం ఒక సంవత్సరం మాత్రమే కాకుండా ఐదు సంవత్సరాలైనా ఎదురుచూస్తానని వెల్లడించారు.ఇలా అల్లు అర్జున్ తో సినిమా చేయడం కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తానని ఈయన ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పడంతో తప్పకుండా ఈ సినిమా భారీగా ఉండబోతుందని అర్థమవుతుంది.మరి ఈ దర్శకుడికి అల్లు అర్జున్ అవకాశం ఇస్తారా లేదా వేచి చూడాలి.