టీడీపీ పరిస్థితి ఉత్తరాంధ్రలో ఎంత దారుణంగా ఉందో అటు రాయల సీమలో కూడా అదే స్థాయిలో ఉంది.నిజానికి చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో కూడా టీడీపీ దారుణంగా ఓడిపోయింది.
కుప్పంలో తప్ప ఎక్కడా పోటీనివ్వలేకపోయింది.మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్లలలో కూడా టీడీపీ పోటీనివ్వలేకపోయింది.
అంతే కాదు పరిషత్ ఎన్నికల్లోనూ బాబుకు పట్టు లేదన్నట్టు ఫలితాలు వచ్చాయి.ఇక పక్కనే ఉన్న కడప జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే.
అయితే ఇక్కడ చంద్రబాబు తీసుకున్న నిర్ణయమే పార్టీని ప్రమాదంలో పడేసింది.
గత ఎన్నికలకు ముందు ఈ జిల్లాలో ఉప్పు, నిప్పులా ఉండే ఇద్దరు నేతలను ఒకే పార్టీలోకి తీసుకురావడంతో టీడీపీని ఎవరూ సరిగ్గా పట్టించుకోలేదు.
దీంతో ఊహించని ఫలితాలు వచ్చాయి.ఇలాంటి సమయంలో ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి చేసిన ప్రకటన టీడీపీలో ఆశలు పెంచుతోంది.ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆయన నెల 20న టీడీపీలోకి తన కుమారుడితో సహా వెళ్తున్నట్టు ప్రకటించారు.ఈ వార్త చంద్రబాబుకు చాలా ఊరటనిచ్చే అంశమనే చెప్పాలి.
ఈయన ప్రకటన జగన్‌కు మాత్రం షాకింగ్ అనే చెప్పాలి.

ఇక నారాయణ రెడ్డి గతంలో టీడీపీ తరఫున మంత్రిగా కూడా పనిచేశారు.ఆయనకు వ్యతిరేక వర్గం అయిన రామ సుబ్బారెడ్డి వర్గానికి అస్సలు పడదు.వీరిద్దరికీ చాలా కాలంగా ఫ్యాక్షన్ నెలకొంది.వీరిద్దరూ గతంలో టీడీపీలోనే ఉన్నారు.ఇక ఎన్నికల్లో ఇద్దరూ ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.ఆ తర్వాత ఆది నారాయణ రెడ్డి బీజేపీలో చేరారు.
అలాంటి ఇద్దరు కీలక వర్గాలు పార్టీ నుంచి వెళ్లిపోవడంతో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారయింది.ఇలాంటి క్లిష్ట సమయంలో ఆది నారాయణ రెడ్డి మళ్లీ టీడీపీలో చేరేందుకు రెడీ అవ్వడంతో కడపలో మళ్లీ సైకిల్‌కు ఊపు వస్తుందని తమ్ముళ్లు భావిస్తున్నారు.
.