ప్రస్తుతం అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.గ్యాస్ సిలిండర్ ధరలు, పెట్రోల్ – డీజిల్ ధరలు బాగా పెరిగిపోయాయి.
దీంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా సామాన్యులు కొనలేని స్థాయికి పెరిగి పోయాయి.ఇటువంటి పరిస్థితుల్లో పెరిగిన ధరలతో సామాన్యులు, పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఏం కొనేట్టు లేదు, ఏం తినేట్టు లేదు అనే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇక పెరిగిన ధరలపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
సామాన్యుల బ్రతుకు దుర్బరంగా మారుతోందని పలువురు వాపోతున్నారు.
సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
మీమ్స్, ఫన్నీ వీడియోల రూపంలో సందేశాన్ని అందిస్తున్నారు.తాజాగా అలాంటి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.ఫన్నీ వీడియోలు, మీమ్స్ కొన్ని విమర్శలు చేసేవిగా మాత్రమే ఉన్నా, చాలా వరకు చక్కటి సందేశాన్ని ఇచ్చేవి కూడా మనకు నెట్టింట కనిపిస్తున్నాయి.
తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ టీచర్, స్టూడెంట్ మధ్య సంభాషణ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.అందులో ఓ బుడతడు తన టీచర్‌తో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తాడు.దీంతో ఏదైనా డౌట్ వచ్చిందేమోనని ఏంటో అడగాలని టీచర్ అంటుంది.దీంతో పప్పు, ఉప్పు, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెరిగిపోతున్నాయని, అందుకే భయం వేస్తుందని ఆ స్టూడెంట్ అంటాడు.
వాటి గురించి ఆ వయసులో ఉన్న స్టూడెంట్ ఎందుకు ఆలోచిస్తున్నాడో టీచర్‌కు అర్ధం కాదు.ఆ విషయం అడగగానే టీచర్‌కు స్టూడెంట్ ఇచ్చిన ఆన్సర్ షాక్‌కు గురి చేస్తుంది.
నిత్యావసర వస్తువుల ధరల తరహాలో తమకు పాస్ మార్కులు పెరిగి పోతాయేమోనని భయం వేస్తుందని బదులిస్తాడు.ఈ ఆన్సర్ కొంచెం ఆశ్చర్యానికి గురి చేసినా, అందులో వాస్తవం మనకు బోధ పడుతుంది.
అడ్డూ అదుపూ లేకుండా నిత్యం పెరుగుతున్న వస్తువులు, గ్యాస్ ధరల గురించి సునిశిత విమర్శ అందులో కనపడుతుంది.ఇప్పటికైనా పాలకులు ఆలోచించి పెరుగుతున్న ధరలకు కళ్లెం వేయాలనే సందేశం అందులో దాగి ఉంది.