నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు పార్టీలు రె"ఢీ" ఇక సమరమేనా?

తెలంగాణలో మరో రాజకీయ సమరానికి సమయం ఆసన్నమైంది.

తెలంగాణలో వరుస ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులలో దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తరువాత నాగార్జున సాగర్ ఎమ్మెల్యే అయిన నోముల నర్సింహయ్య మృతితో నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్నది.

అయితే ఏప్రిల్ 17 న తిరుపతి ఉప ఎన్నికతో పాటుగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనుంది.అయితే ఇక ఏప్రిల్ 17 న ఉప ఎన్నిక జరగనుండంతో ఇక రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

ఇక బీజేపీ విషయానికొస్తే దుబ్బాకలో, గ్రేటర్ ఎన్నికల్లోనైతే ఎటువంటి వ్యూహాన్ని అమలు చేశారో, అదే వ్యూహాన్ని బీజేపీ నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కూడా ప్రయోగించే అవకాశం ఉంది.ఏది ఏమైనా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

అంతేకాక కాంగ్రెస్ తన బలాన్ని చూపించుకునేందుకు ఇది మరో సువర్ణవకాశంగా చెప్పవచ్చు.అయితే దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన దెబ్బను తట్టుకొని మరల కుమ్మలాటలకు తావు లేకుండా అందరు సమిష్టిగా నాగార్జున సాగర్ కాంగ్రెస్ అభ్యర్థి విజయం కొరకు శ్రమిస్తే ఎంతో కొంత తమ సత్తాను చాటుకోవచ్చు.

Advertisement

ఇక టీఆర్ఎస్ విషయానికొస్తే ఇప్పటికైతే ఇంకా నిర్ణయం తీసుకోకున్నా చాలా జాగ్రత్తగా గెలిచే సత్తా ఉన్న అభ్యర్థినే టీఆర్ఎస్ బరిలో నిలిపే అవకాశం ఉంది.చూద్దాం నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందనేది చూడాల్సి ఉంది.

మాచర్లకు వెళ్ళకూడదు అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు ఆదేశాలు..!!
Advertisement

తాజా వార్తలు