బారాస నేతల ధైర్యం సన్నగిల్లుతుందా?

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని ప్రతి వేదిక మీదా అనర్గళంగా ఉపన్యసిస్తున్న కేసీఆర్( CM KCR ) ,మరోసారి అధికార పీఠం అధిష్టించేది తామేనని ధీమా పైకి ప్రదర్శిస్తున్నా ,తరుముకొస్తున్న కాంగ్రెస్ ఉత్సాహం పట్ల కొంత ఆందోళన గానే ఉన్నట్లుగా భరాస నేతల వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి.నిన్న మొన్నటి వరకూ తమను గెలిపించకపోతే ప్రజలు నష్టపోతారని, తాను ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటాను అన్న కేసీఆర్ వ్యాఖ్యలకు విరుద్ధంగా ఇటీవల ఆ పార్టీ కీలక నేత హరీష్ రావు( Harish Rao ) చేసిన వ్యాఖ్యలను రాజకీయ పరిశీలకులు ఉదహరిస్తున్నారు తప్పులుంటే సరిదిద్దుకుంటామని, ఇంటిలో ఎలుకలు ఉంటే ఇంటినే తగలబెట్టుకోము కదా అంటూ వాడుతున్న ఉపమానాలు చూస్తుంటే అధికారం పై బీఆరఎస్ నేతల ధీమా సన్నగిల్లుతుందా అన్న విశ్లేషణలు వస్తున్నాయి.

 Will The Courage Of Barasa Leaders Weaken , Brs Paty , Congress Party , Ts Poli-TeluguStop.com
Telugu Brs Paty, Cm Kcr, Congress, Harish Rao, Rythu Bandhu, Telangana, Ts-Telug

ముఖ్యంగా బారాస అవినీతి పై భారీ ఎత్తున చర్చ జరుగుతూ ఉండటం, కాలేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ పిల్లర్ బ్యారేజ్ కుంగుబాటు వంటి అంశాలు బారాస ఆత్మవిశ్వాసాన్ని తగ్గించినట్లుగా కనిపిస్తున్నాయి.మరోవైపు బారాస అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలోని వైఫల్యాలను వివరిస్తున్న కాంగ్రెస్ తాము వస్తే దానిని మించిన వ్యవస్థలను ఏర్పాటు చేస్తామని చేస్తున్న ప్రచారం తెలంగాణ ప్రజల మనసు మారుస్తుందేమో అన్న అనుమానం కూడా అధికార పార్టీని వేదిస్తున్నట్టు తెలుస్తుంది . రైతు బంధు , రైతు ఋణ మాఫీ వంటి పద్ధకాలను భూమి యజమానులకు కాకుండా కౌలు రైతులకు వర్తింప చేస్తామని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం కూడా కాంగ్రెస్ కు అనుకూలం గా పరిస్తితి మారుతున్నట్టు కనిపిస్తుందిఅట .

Telugu Brs Paty, Cm Kcr, Congress, Harish Rao, Rythu Bandhu, Telangana, Ts-Telug

మెజారిటీ సిట్టింగ్ ఎంఎల్ఏ లను కొనసాగించడం కూడా బారాసపై వ్యతిరేకతకు కారణమైందని తెలుస్తుంది కేసీఆర్ పరిపాలనకు పాస్ మార్కులు వచ్చినా కూడా క్షేత్రస్థాయిలో నాయకుల మీద ఉన్న వ్యతిరేకత బారాస కు ఇబ్బందిగా మారుతుంది అన్న విశ్లేషణలు ఈ మధ్య పెరుగుతున్నాయి, పైగా బజాపా రేసు నుంచి తప్పుకున్నట్లుగా వ్యవహరించడంతో ప్రభుత్వ వ్యతిరేకతగా గంపగుత్త గా కాంగ్రెస్కే పడే వాతావరణం కనిపిస్తుంది.చిన్న చిన్న పార్టీలు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం, తెలంగాణ ఎన్నికల( Telangana election ) నుంచి తెలుగుదేశం తప్పుకోవటం, తెలుగుదేశం అనుకూల మీడియా, కార్యకర్తలు ,కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవుతున్నట్లుగా వార్తలు వస్తుండటం కెసిఆర్ ని కలవర పెడుతున్నట్లుగా తెలుస్తుంది.ఏది ఏమైనా ప్రచారం మొదట్లో ఉన్నంత ఉత్సాహం భారాస నేతల వాయిస్ లో కనిపించడం కొంత మంది వాఖ్యనిస్తున్నారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube