నిన్న మొన్నటి వరకు ఎన్డీఏతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు( Chandrababu ) ఎంత తాపత్రయపడినా ఇది సరైన సమయం కాదన్నట్టుగా వ్యవహరించిన బిజెపి పార్టీ ఇప్పుడు బాబు కదలికలను ఆసక్తికరంగా గమనిస్తున్నట్లుగా తెలుస్తుంది.తెలంగాణలో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ప్లాన్- బి గా రెండవ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ వైపుగా కదులుతున్న వైనాన్ని కమలనాధులు నిశితంగా గమనిస్తున్నట్లుగా తెలుస్తుంది.
ముఖ్యంగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కనుక కాంగ్రెస్ పుంజుకుంటే అప్పుడు చంద్రబాబు మరోసారి చాణుక్యుడి పాత్ర పోషించే అవకాశం ఉందని, తనకున్న పరిచయాలను ఉపయోగించుకొని మరోసారి కాంగ్రెస్ నాయకత్వంలో తమకు వ్యతిరేక కూటమి కట్టవచ్చు అన్న అంచనాలు కూడా బజాపా అధిష్టానం లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది .దాంతో ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల వ్యవహారాన్ని కూడా సాధ్యమైనంత తొందరగా తేల్చేసుకుంటేనే మంచిదన్న వ్యూహం లో కమలనాధులు ఉన్నట్లుగా చెప్తున్నారు.
ఒకసారి 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిపోతే ఇక పూర్తిస్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పై దృష్టి పెట్టాలని బిజెపి అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది .అయితే చంద్రబాబును ఎన్డీఏలోకి తీసుకునే విషయంలో బిజెపిలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయట.ముఖ్యంగా సురేష్ ప్రభు, నితిన్ గడ్కరీ , నిర్మలా సీతారామన్ వంటి నేతలు చంద్రబాబుతో కలిసి నడిస్తేనే మంచిదని చెబుతూ ఉండగా మరికొంతమంది మాత్రం బాబు నమ్మదగిన మిత్రుడు కాదని ప్రతి విషయంలోనూ వెన్నుదన్నుగా ఉంటున్న జగన్తో కలిసి నడిస్తేనే మంచిదని అధిష్టానానికి హితవు పలుకుతున్నారట.
అయితే వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారన్నదానిపై ప్రస్తుతం సందిగ్ధత నడుస్తుంది అని జనసేన తెలుగుదేశం పార్టీ ( Janasena Telugu Desam Party )ల పొత్తు విన్నింగ్ కాంబినేషన్ అని అంచనాలు ఉన్నా , మరోవైపు భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసిన జగన్ ఓటు బ్యాంకు కూడా స్థిరంగానే ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎవరితో కలిసి నడిస్తే భవిష్యత్తుకు మంచిదన్న కోణం లో బజాపా లో ( Bjp )ఇంకాఅనిశ్చితి కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది .
ముఖ్యంగా వచ్చే ఎన్నికలలో తక్కువ మార్జిన్ తోనే గట్టెకుతారన్న సర్వే రిపోర్టులు ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నిక కాబోయే పార్లమెంట్ సభ్యులు కీలకపాత్ర పోషిస్తారని అంచనాలు ఉన్నాయి.దాంతో ఏ పార్టీ కి విజయ వకాశాలు ఎక్కువ ఉన్నాయన్న దానిపై పూర్తిస్థాయి సమాచారం వచ్చిన తర్వాతే పొత్తు నిర్ణయాన్ని ఫైనల్ చేసుకోవాలని భాజపా అధిష్టానం ( Bjp )భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.