జేపీ నడ్డా సభతో కమలం మరింతగా వికసిస్తుందా?

తెలంగాణలో నాయకులు ఏ గట్టున ఉన్నారు? ప్రజలు అభిమానిస్తున్న పార్టీలో ఉన్నారా? ప్రజాభిమానం కోల్పోతున్న పార్టీల్లో ఉన్నారా? జనాకర్షణ ఉన్న నాయకుల్ని పార్టీలోకి తీసుకురావాలంటూ బీజేపీ చీఫ్ నడ్డా చేసిన కామెంట్స్ అర్థం ఏంటి? ఇతర పార్టీల నుంచి ప్రజాకర్షణ ఉన్న నాయకులు రావాలంటే కమలనాథుల వ్యూహాలు ఎలా ఉండాలి? తెలంగాణ రాష్ట్రంలో సమరోత్సాహంతో ఉరకలు వేస్తున్నబీజేపీకి పోటీ ఎవరు? జేపీ నడ్డా సభతో కమలం మరింతగా వికసిస్తుందా.

 Will The Bjp Party Blossom Further With J.p Nadda Sabha, Ts Poltics , Bjp Party-TeluguStop.com

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే.

కిందిస్థాయిలో కేడర్‌ బలోపేతమవ్వాలి.అందుకోసం నియోజకవర్గాల వారీగా జనాకర్ష నేతలను పార్టీలోకి ఆహ్వానించాలి.

వివిధ పార్టీలో బలయైన నేతలను ఆపరేషన్ ఆకర్ష్ల లో తమ వైపునకు తిపుకోవాలి.అలాగే ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతలను, యువతను బీజేపీలో చేర్పించాలి.

ఇపుడున్న క్యాడర్తో పాటు కొత్తవారితో పార్టీని బలోపేతం చేయాలి.ముఖ్యంగా దళితులతో మమేకమవ్వాలి.

వారితో కలిసిమెలిసి పనిచేయాలి.ఇలా రాష్ట్ర బీజేపీ నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు.

బూత్‌స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి.పార్టీ విస్తరణకు దళితవాడలకు వెళ్ళాలి.

ముందస్తు ప్రణాళికలతో సాగాలని, తీనికి క్యాడర్తో మమేకమై నిరంతరం వారితో టచ్ లో ఉండాలి.కేసీఆర్‌ ప్రభుత్వ అవినీతిపై నిలదీసేలా ముందుగానే సన్నద్ధమవ్వాలి ఈ విషయాలపై రాష్ట్ర బీజేపీ నాయకులు దృష్టి పెట్టి ఆపరేషన్ ఆకర్ష్ చేసి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించింది.

Telugu Bandi Sanjay, Bjp, Central, Jp Nadda Sabha, Jp Nadda, Kishan Reddy, Ts Po

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.పాలమూరు జిల్లాలో మెజార్టీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఇవాళ మహబూబ్‌ నగర్‌లో కాషాయదళం భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది.ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ తరుణ్‌ చుగ్‌తో పలువురు కీలక నేతలు హాజరవుతున్నారు.ఈ సభకు వందలాది వాహనాల్లో ప్రజలు స్వచ్చందంగా హాజరవుతున్నారు.ఈ సభకు జనం ఉప్పెనాలా తరలి వస్తున్నారని బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి అన్నారు.

ఈ ఉప్పెనలో అవినీతి టీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టుకుపోతుందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube