ఏపీ సీఎం జగన్ కు ఇప్పుడు ఓ విషయం ఫేవర్ చేసేలా కనబడుతోంది.ఆ విషయం బీజేపీ కి జగన్ ను మరింత దగ్గర చేసే అవకాశాలు కూడా లేకపోలేదు.
పొరుగు రాష్ట్ర సీఎం కేసీఆర్ కూడా జగన్ కు మేలే చేస్తున్నారనే వాదనలు అంతటా వినిపిస్తున్నాయి.అదే కనుక నిజమైతే జగన్ బీజేపీకి మరింత దగ్గరయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.2024 ఎన్నికలకు ముందు ఈ పరిణామం జగన్ కు ఆయన పార్టీకి బూస్ట్ తెస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.ఇంతకీ జగన్ కు ఫేవర్ గా జరుగుతున్న విషయం ఏంటంటే.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు థర్డ్ ఫ్రంట్ పేరుతో దేశ వ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్సేతర పార్టీల నాయకులను కలుస్తున్నారు.ఎలాగైనా సరే 2024 ఎన్నికల్లో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు.
అందుకోసం దేశవ్యాప్త పర్యటనలు కూడా చేస్తున్నారు.కానీ పొరుగునే ఉన్న కాంగ్రెస్, బీజేపీ యేతర ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డిని మాత్రం కలవడం లేదు.
ఇప్పుడు ఇదే ఆంశం జగన్ కు బీజేపీ వద్ద ఎక్కువ మైలేజ్ ను తెచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.2024 ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా సంపూర్ణ మెజారిటీ రావడం కష్టమేనని దాంతో బీజేపీ ప్రభుత్వాన్ని స్థాపించేందుకు ఇతర పార్టీల అవసరం పడుతుందని విశ్లేషిస్తున్నారు.ఇటువంటి తరుణంలో తమకు ఎక్కువ నమ్మకంగా ఉన్న జగన్ వైపు బీజేపీ తప్పకుండా చూసే అవకాశం ఉందని చెబుతున్నారు.మరి 2024లో ఏం జరగనుందో.అందరూ విశ్లేషించినట్లుగా ఏపీ సీఎం జగన్ కు బీజేపీ నుంచి ఏదైనా ఆఫర్ వస్తుందో లేదో కొన్ని రోజులలో తేలనుంది.మరో పక్క రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు మాత్రం వైసీపీ మీద కత్తులు దూస్తూనే ఉన్నారు.