తెలంగాణలో ఇప్పటికి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన వ్యతిరేకత ప్రభుత్వాన్ని దింపే స్థాయిలో లేదని, ముఖ్యంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం, తాగునీటి, సాగునీటి ప్రాజెక్టు లు కట్టడం, తెలంగాణ వ్యవసాయ( Telangana Agriculture ) పరిధిని పెంచి రాష్ట్ర తలసరి ఆదాయాన్ని పెంచడం దాన్ని కేంద్రం కూడా సర్టిఫై చేయడం వంటి చర్యలతో కేసీఆర్( KCR ) ఇమేజ్ ఎన్నికలకు ముందు బాగా పెరిగిందని వార్తలు వచ్చాయి.అంతేగాకుండా దళిత బంధు, రైతుబంధు వంటి పథకాలు ఒక ఫిక్స్డ్ ఓటు బ్యాంకు ను బారాస వైపు నిలబెట్టాయి .
అంతేకాకుండా ఎన్నికలు తాయిలాలుగా ఆర్టీసీ విలీనాన్ని, రైతులకు రుణమాఫీ సమ్మోహన అస్త్రాలుగా ప్రయోగించిన కేసీఆర్ మెజారిటీ తెలంగాణ ప్రజానీకాన్ని ఆకట్టుకున్నట్టుగా విశ్లేషణలు వచ్చాయి.

దాంతో మిగతా పార్టీల కన్నా అధికార బారాస ఒక అడుగు ముందు ఉందన్నట్లుగా వాతావరణం కనిపించింది .అంతేకాకుండా ప్రతిపక్షాల కన్నా ముందుగా జెట్ స్పీడ్ లో అభ్యర్థులను ప్రకటించడం, ప్రచార సరళి లో దూసుకుపోతుండడంతో ఈసారి కూడా గెలిచి బారాస హ్యాట్రిక్ కొడుతుందన్న అభిప్రాయాన్ని చాలామంది రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేశారు.అయితే చాపకింద నీరులా విస్తరిస్తున్న కాంగ్రెస్( Congress ) బారసా కి కీలెరిగి వాత పెడుతూ ముందుకు వెళుతూ ఉండటం ఇప్పుడు అధికార పార్టీని కలవరపెడుతున్నట్లుగా తెలుస్తుంది.
ముఖ్యంగా దళిత సామాజిక వర్గాలకు సీట్ల కేటాయింపులో అన్యాయం చేశారని మేజారిటీ స్థానాలలో సిట్టింగులను కొనసాగించి కేవలం దళితులు ఉన్న స్థానాలను మాత్రమే మార్చారంటూ కాంగ్రెస్ కొత్త స్లోగన్ అందుకోవటం అధికార పార్టీకి కొంత ఇబ్బంది కలుగుతున్నట్లుగా తెలుస్తుంది .

అంతేకాకుండా స్టేషన్ ఘన్ పూర్, నిర్మల్ ( Station Ghanpur, Nirmal )జిల్లాలోని ఖానాపూర్ వంటి నియోజక వర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని నిర్ణయం తీసుకోవడం ఆయా అభ్యర్ధులకు ఇప్పుడు హస్తం పార్టీ అభయహస్తం గా మారినట్లు తెలుస్తుంది.దాంతో వీరు దళితులపై కేసీఆర్కు చిత్తశుద్ధి లేదంటూ ప్రచారం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.ఆ ప్రచారం ఉధృత మైతే ఇప్పటివరకు బారసా కి మద్దతుగా నిలబడిన కీలక సామాజిక వర్గం బారసా కి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని అంతేకాకుండా గెలుపు గుర్రాలను వెంటపడి మరీ పార్టీలోకి చేర్చుకుంటున్న కాంగ్రెస్ వచ్చే ఎన్నికలలో గట్టి పోటీ ఇవ్వడం తద్యమని వార్తలు వస్తున్న నేపధ్యం లో తెలంగాణ లో నెమ్మదిగా పొలిటికల్ సీను మారుతున్నట్లుగా పలువురు అభిప్రాయపడుతున్నారు.







