ఈ ఐపీఎల్( IPL ) సీజన్ చివరి దశకు చేరుకుంది.ప్రస్తుతం ప్రతి జట్టుకు ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది.
ప్లే ఆఫ్( Playoffs ) చేరాలంటే చివరి మ్యాచ్లు అన్ని జట్లకు కీలకంగా మారాయి.ప్రతి మ్యాచ్ కు గణాంకాలు తారుమారు అవుతున్నాయి.
ప్రతి జట్టుకు చివరి మ్యాచ్ డూ ఆర్ డై గా సాగుతోంది.తాజాగా పంజాబ్-రాజస్థాన్( PBKS vs RR ) మధ్య జరిగిన మ్యాచ్ ఇరుజట్లకు కీలకమే.
రాజస్థాన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం చేసుకుంది.కానీ రాజస్థాన్ ప్రస్తుతం 14 పాయింట్లతో ఉంది.
కాబట్టి రాజస్థాన్ ప్లే ఆఫ్ చేరాలంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంది.

ముఖ్యంగా ముంబై, బెంగుళూరు( MI, RCB ) జట్ల చివరి మ్యాచ్ ఫలితాలపై రాజస్థాన్ ప్లే ఆఫ్ చేరే అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.అంటే హైదరాబాద్ చేతిలో ముంబై ఓడిపోవడం, గుజరాత్ చేతిలో బెంగుళూరు ఓడిపోవడం జరిగితే రాజస్థాన్ ప్లే ఆఫ్ చేరుతుంది.అది కూడా ముంబై నాలుగు పరుగుల తేడాతో ఓడడంతో పాటు గుజరాత్ 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించాలి.ఇలా జరగాలంటే అది ఒక అద్భుతమే.

ఎందుకంటే ప్రస్తుతం ముంబై, రాజస్థాన్, బెంగళూరు జట్లు 14 పాయింట్ లతో సమానంగా ఉండి, నెట్ రన్ రేట్( Net run rate ) పరంగా వివిధ స్థానాలలో ఉన్నాయి.కాబట్టి నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో రాజస్థాన్ ప్లే ఆఫ్ చేరే ఛాన్స్ ఉంది.
గుజరాత్ జట్టు 18 పాయింట్ల తో లీగ్ పట్టికలో అగ్రస్థానంలో ఉంది.గుజరాత్ తన చివరి మ్యాచ్ తో సంబంధం లేకుండానే ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంది.
ఇక మిగిలిన మూడు ప్లే ఆఫ్ బెర్త్ స్థానాల కోసం ఆరు జట్లు రేసులో కొనసాగుతున్నాయి.ఇందులో కొన్ని జట్లకు గెలుపుతో పాటు నెట్ రన్ రేట్ కూడా కీలకమే.
ఇక కొన్ని గంటల్లోనే ప్లే ఆఫ్ రేస్ ఉత్కంఠ వీడనుంది.







