ఇక తెలంగాణ రాజకీయాలలో షర్మిలను పీకే నడిపించనున్నాడా?

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి.అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలతో కొత్త పార్టీల ఎంట్రీతో గందరగోళంగా మారుతున్నాయి.

తెలంగాణ రాజకీయాల్లో అకస్మాత్తుగా షర్మిల తెలంగాణ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఓ పత్రిక కథనంతో వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఆ తరువాత ఈ పత్రిక కథనాన్ని బలపరుస్తున్నట్లుగా తెలంగాణ రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించింది.

ఆ తరువాత జిల్లాల వారీ నేతలతో సమావేశమై క్షేత్ర స్థాయిలో పార్టీ ఏర్పాటు చేస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయనే విషయంపై నేతలతో సంప్రదింపులు నిర్వహించింది.అయితే ఆ తరువాత ఖమ్మం సభ నిర్వహించడం, నిరుద్యోగులకు తక్షణమే నోటిఫికేషన్ లు విడుదల చేయాలని 72 గంటల నిరాహారదీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పటికే నిరాహార దీక్ష నిర్వహణ ప్రముఖ రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిశోర్ ఉన్నట్టు తెలుస్తోంది.  రాజకీయ వ్యూహాలలో దిట్ట అయిన ప్రశాంత్ కిశోర్ ఇప్పడు దేశ రాజకీయాలను ఎలా శాసిస్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం.

Advertisement

అయితే ఒకవేళ ప్రశాంత్ కిశోర్ షర్మిల పార్టీ వ్యవహారాలను చూస్తే తెలంగాణలో మరో కీలక పార్టీగా ఎదిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.మరి  ప్రశాంత్ కిశోర్ ఏ మేరకు షర్మిల పార్టీని తన వ్యూహాలను ఎలా నడిపిస్తాడో చూడాల్సి ఉంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు