పక్క రాష్ట్రాల్లో కూడా నెం.1 గా కొనసాగుతున్న తెలుగు హీరోలు ఎవరో తెలుసా..?

తమిళ్, కన్నడ, మలయాళీ సినిమాలలో పోల్చితే తెలుగు సినిమాలకు కమర్షియల్ హంగులు చాలా ఎక్కువ.అందుకే ఆయా రాష్ట్రాల్లో సొంత సినిమాల కంటే తెలుగు సినిమాలు అంటేనే జనాలు ఎక్కువ ఇష్టపడతారు.

 Tollywood Heroes Who Are Number One In Other States, Tollywood Heroes, Various L-TeluguStop.com

సౌతిండియాలో మన సినిమాలకు ఉన్నత మార్కెట్ మరే సినిమాలకు ఉండకపోవడం విశేషం.అంతేకాదు.

తెలుగు సినిమాల ఓపెనింగ్స్ కూడా భారీగా ఉంటున్నాయి.సౌత్ రాష్ట్రాల్లో తెలుగు టాప్ హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

తమిళం

తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ కు రాకముందు చెన్నై కేంద్రంగానే ఉండేది.అందుకే తెలుగు సినిమాలను ఇప్పటికీ తమిళ ప్రజలు బాగా ఆదరిస్తున్నారు.

చెన్నైలో తెలుగు జనాభా కూడా అధికంగానే ఉండటం వల్ల టాలీవుడ్ హీరోలకు మంచి వసూళ్లు వస్తున్నాయి.అంతేకాదు తమిళ హీరోల కంటే తెలుగు హీరోలకే ఎక్కువ అభిమానులు ఉండటం విశేషం.

తమిళనాట మహేష్ బాబు, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీ ఆర్ కు ఎక్కువ ఆదరణ ఉంది.క్రిష్ణ అభిమానుల సంఘం మహేష్ ను, చిరు అభిమానుల సంఘం పవన్ ను, బాలయ్య అభిమానుల సంఘం జూ.ఎన్టీ ఆర్ ను ప్రమోట్ చేస్తున్నాయి.

కన్నడ

కర్నాటక జనాలు తెలుగు హీరోలను తమ హీరోలతో సమానంగా చూస్తారు.వారికంటే ఒక్కోసారి టాలీవుడ్ స్టార్స్ కే మంచి ఆదరణ కలిగిస్తారు.రాయలసీమ జిల్లాలు కర్నాటకకు ఆనుకుని ఉండటం మూలంగా సాధారణంగానే ఇక్కడి మూలాలు అక్కడ ఉన్నాయి.అంతేకాదు.అక్కడి సినిమాల కంటే మన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి.

ఈ సినిమాలను చూసేందుకు జనాలు ఎగబడతారు.కన్నడలో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబుకు ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు.

మలయాళం

మలయాళంలో మంచి స్టోరీ ఉన్న సినిమాలు వస్తాయి కానీ.కమర్షియల్ హంగులు ఉన్న సినిమాలు అంతగా రావు.అందుకే టాలీవుడ్ సినిమాలు అంటే వారికి ఎంతో ఇష్టం.అయినా.మన హీరోలను అంతగా ఆదరించరు.

కేరళలో అల్లు అర్జున్, జూ.ఎన్టీఆర్, మహేష్ బాబుకు ఎక్కువ గుర్తింపు ఉంది.ప్రభాస్ కు తమిళనాడు, కేరళ, కర్నాటకలో టాలీవుడ్ హీరోలు అందరికంటే ఎక్కువ మార్కెట్ ఉంది.బాహుబలి సినిమాతో సౌత్ ఇండియాలో తనకంటే ఓ ప్రత్యేకత చాటుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube