ఒకవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలతో జనసేనాని షెడ్యూల్ ఇప్పటికే చాలా బిజీగా ఉంది.అలుపెరగని షూటింగులు ఒక వైపు జనసేన రాజకీయ సభలు సమావేశాలు మరో వైపు తో శక్తికి మించి కష్టపడుతున్న పవన్ ( Pawan Kalyan )ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ జనసేన తెలంగాణ ప్రయాణం పై పలు ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇంతకు ముందు జరిగిన అనేక విలేకరుల సమావేశాలలో తెలంగాణలో జనసేన ( Janasena )పోటీ చేస్తుందని సీట్ల సంఖ్యను కూడా ఇదమిత్తం గా చెప్పిన పవన్ ,మరి ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నది ఆసక్తికరం గా మారింది.

భాజపాతో ( BJP )ఎన్డీఏలో భాగస్వామినని పదేపదే చెప్పుకుంటున్న పవన్ మరి తెలంగాణలో పోటీ చేస్తున్న భాజపాకు మద్దతుగా నిలబడతారా? లేక తన పొత్తులు ఆంధ్రా వరకే పరిమితం అని ఎన్నికలలో పోటీ చేస్తారా అన్నది ఇప్పటికీ స్పష్టం కాలేదు.తెలంగాణ బిజెపి నేతలు కూడా తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఏ పార్టీతోనూ పొత్తులు లేవని ఇప్పటికే తేల్చేసిన దరిమిలా పవన్ ప్రయాణం ఎవరితో అన్నది అంత చిక్కని ప్రశ్నగా మారింది.మరోవైపు టిడిపికి కూడా తెలంగాణపై అంతో ఇంతో ఆశలు ఉన్నాయి .ఒకప్పుడు అధికారాన్ని చలాయించిన పార్టీగా ఆ పార్టీకి కొంత కేడర్ అక్కడ మిగిలే ఉంది.ఆంధ్రమూలాలు కలిగిన ఓటర్లతో పాటు ఒకప్పుడు టిడిపిని కంచుకోటగా నిలిపిన నాయకులు కూడా తెలంగాణలో ఉన్నారు .ఇప్పుడు జనసేన- తెలుగుదేశం పొత్తులు ఇప్పటికే స్పష్టమైనందున ఇదే పొత్తును తెలంగాణకి కూడా పొడిగిస్తారా ? అయితే కేసీఆర్ కేటీఆర్ లతో కూడా పవన్ కు మంచి సంబంధాలే ఉన్నాయి.

ఇంతకు ముందు జరిగిన ఉప ఎన్నికలలో అధికార బారాసా కి పవన్ మద్దతు కూడా ఇచ్చారు.మరి ఇప్పుడు టిడిపితో కలిసి ముందుకు వెళ్తే కేసిఆర్( CM kcr ) కి వ్యతిరేకంగా నిలబడినట్లు అవుతుంది.దానికి పవన్ ( Pawan Kalyan ) ఇప్పుడున్న పరిస్థితుల్లో సాహాసిస్తారా? అంటే అనుమానమనే చెప్పాలి.ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసిపి అనేక విషయాల్లో పవన్ ను ఇబ్బంది పెట్టాలని చూసినా తనకు కావలసిన పనులన్నీ హైదరాబాద్ కేంద్రంగా చక్కబెట్టుకుంటూ పవన్ రిలీఫ్ పొందుతున్నారు.ఈ పరిస్థితుల్లో బారాసా కు వ్యతిరేకంగా వెళ్తే పవన్ కి కొత్త ఇబ్బందులు ఎదురవ్వవచ్చు అలా అని బారాసా మద్దతుగా వెళితే బిజెపితో తెగదెంపులు చేసుకోవాల్సి రావచ్చు .అసలే తీరికలేని షెడ్యూల్ తో ఊపిరి సలపకుండా ఉన్న పవన్ తెలంగాణ ఎన్నికలపై లో వేలు పెట్టకుండా ఉండటమే మంచిదన్న విశ్లేషణలు వస్తున్నాయి .







