తెలంగాణ అసెంబ్లీ( Telangana Assembly )లో ఇరిగేషన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది.ఈ క్రమంలోనే కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాటర్ వార్ కొనసాగుతోంది.
కాంగ్రెస్ మంత్రుల ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు( BRS MLA Harish Rao ) మాట్లాడుతూ సభలో అబద్ధాలను చెబుతూ గోబెల్స్ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.మిడ్ మానేరు( Mid Manair ) ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి అయినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.
భవిష్యత్తులో అసెంబ్లీకి రానని హరీశ్ రావు తెలిపారు.







