తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ( BRS ) పార్టీ తిరుగులేని శక్తిగా ఉంది.ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న ఈ పార్టీ మూడవసారి కూడా అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది.
ఈ తరుణంలోనే కేసీఆర్ వేసిన ఆ ప్లాన్ ఇబ్బంది పెడుతోందట.ఆ వివరాలు ఏంటో చూద్దాం.
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఎంతోమంది సీనియర్ నేతలు ఉన్నారు.టికెట్ల కోసం ఎదురుచూస్తున్న ఆశావాహులు కూడా ఉన్నారు.త్వరలో ఎలక్షన్స్ వస్తున్న క్రమంలో అభ్యర్థులను ప్రకటించే విషయంలో కేసీఆర్ ( KCR ) కాస్త ఇబ్బంది ఎదుర్కొంటున్నారట.ఎందుకంటే ఇతర పార్టీల నుంచి చాలామంది సీనియర్ నేతలు బిఆర్ఎస్ లో చేరారు.
వారికి ఒక్కసారైనా టికెట్ ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలి.

అంతేకాకుండా చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు,ఎంపీలు, ఇతర పదవులు పొందిన వారు ఉన్నారు.ఈ సిట్టింగ్ లే మరోసారి టికెట్లు అడుగుతున్నారు.కానీ కేసీఆర్ (KCR) ఇతర సీనియర్లకు ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారట.
ఈ క్రమంలోనే టికెట్లు, పదవుల విషయంలో సతమతమవుతున్నారట.పార్టీ నేతలందరినీ కేసీఆర్ బయటకు వెళ్లకుండా కాపాడుకోవాలి అంటే ఆశావాహులకు టికెట్లు ఇవ్వాల్సిందే.
అలాగని ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న సీనియర్లకు కూడా టికెట్లు ఇవ్వాల్సిందే.మరి ఇందులో ఎవరిని కాంప్రమైజ్ చేయాలో కేసీఆర్ కు అర్థం కావడం లేదట.
అంతేకాకుండా కాంగ్రెస్ ( Congress ) ని ఎలాగైనా దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలను బిఆర్ఎస్ పార్టీలోకి లాగేందుకు ప్లాన్ కూడా వేస్తున్నారట.

ఒకవేళ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇందులోకి వస్తే వారికి ఎక్కడ టికెట్లు ఇస్తారు ఏ పదవులు ఇస్తారో అర్థం కాని పరిస్థితుల్లో బీఆర్ఎస్ ( BRS ) అధిష్టానం ఉన్నదని, దీనిపై కేసీఆర్ కూడా తర్జన భర్జన అవుతున్నారని తెలుస్తోంది.