కెసీఆర్ దీక్ష ఇప్పుడు దేశ వ్యాప్త అంశం కానున్నదా?

యాసంగిలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ నేడు కెసీఆర్ అధ్యక్షతన రైతు మహా ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం తెలంగాణలో వరి ధాన్యంపైనే పెద్ద ఎత్తున ఆధారపడి ఉన్న కారణంగా ఖచ్చితంగా కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది.

 Will Kcr Initiation Now Be A Nationwide Issue Details. Trs Party, Kcr , Kcr Rait-TeluguStop.com

అయితే కేంద్రం సూచించిన విధంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని చూస్తే బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా కెసీఆర్ ఆగ్రహానికి గురైన పరిస్థితి ఉంది.ఇక యాసంగిలో వరి ధాన్యం వేసుకోవాలని బీజేపీ అధ్యక్షులు చెప్పినట్టుగా ఆ మాటకు కట్టుబడి ఉండి, రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొంటామని లెటర్ తీసుకరావాలని  కెసీఆర్ సవాల్ విసిరారు.

ఈ అంశంపై తేల్చే దాకా బీజేపీని వదిలిపెట్టే పరిస్థితి లేదని కెసీఆర్ వ్యాఖ్యానించారు.అయితే ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దీక్ష చేపట్టడంతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా ఒక్కసారి చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది.

అయితే కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందా, స్పందించదా అన్న విషయం పక్కన పెడితే వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి మాత్రం ఒక్కసారిగా బట్టబయలైన పరిస్థితి ఉంది.

Telugu @cm_kcr, Bandi Sanjay, Bjp, Central, Cm Kcr Farmers, Farmers, Grab Nation

పంజాబ్ లో పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని అదే తరహాలో తెలంగాణలో కొనుగోలు చేయాలని లేకుంటే కొనుగోలు చేయమని బహిరంగంగా చెప్పాలని కెసీఆర్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఇది ఆరంభం మాత్రమేనని ఇక ముందు ముందు ఇంకా చాలా చూడాల్సి ఉంటుందని కెసీఆర్ స్పష్టం చేస్తున్నారు.మరి కేంద్ర ప్రభుత్వమయితే తమ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉండదని చర్చ జరుగుతోంది.

దీంతో తెలంగాణలో బీజేపీ రైతుల ముందు అభాసుపాలు అవడానికి ఎక్కువగా అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube