దీపావళి సినిమాలకు కూడా గట్టి పోటీ ఇవ్వబోతున్న కాంతారా.. ఇప్పట్లో ఆగడం కష్టమే!

తాజాగా కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన సినిమా కాంతారా.రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించిన కాంతారా సినిమా కన్నడంలో రిలీజ్ అయ్యి రికార్డ్ స్థాయి వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ దగ్గర అసాధారణమైన విజయాన్ని నమోదు చేసుకుంది.

 Will Kantara Pose A Threat To Diwali Releases Ginna Sardar Prince Oridevuda Deta-TeluguStop.com

చిన్న సినిమాగా మొదలై ప్రభంజనం సృష్టిస్తున్న ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు.

ఇప్పటికే కాంతారా సినిమా కన్నడ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించింది.ఈ సినిమా పరుగులు చూస్తుంటే ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.100 కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తుంది.ఇక కన్నడ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయినా ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది.ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రాబడుతున్న వసూళ్లు చూసి అంతా ఆశ్చర్య పోతున్నారు.

అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసి భారీ లాభాలను ఆర్జిస్తున్నాడు.

ఇదిలా ఉండగా.

ఈ వీకెండ్ తర్వాత దీపావళి ఉండడంతో వరుస సెలవలు వచ్చాయి.

Telugu Diwali, Ginna, Kannada, Kantara, Ori Devuda, Prince, Rishab Shetty, Sapth

దీంతో ఈ వారం పెద్ద పెద్ద సినిమాలు బరిలో నిలిచాయి.ఈ వారం అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు జిన్నా, ఓరి దేవుడా, ప్రిన్స్ సినిమాలతో పాటు కార్తీ సర్దార్ కూడా రిలీజ్ కాబోతుంది.ఈ సినిమాల్లో అన్నిటికి వేటికవే అంచనాలు పెంచేసుకున్నాయి.

Telugu Diwali, Ginna, Kannada, Kantara, Ori Devuda, Prince, Rishab Shetty, Sapth

అయితే ఇన్ని మీడియం బడ్జెట్ సినిమాలు రాబవుతున్న కాంతారా సినిమా స్పీడ్ మాత్రం తగ్గేలా కనిపించడం లేదు.ఈ నాలుగు సినిమాల్లో ఎన్ని హిట్ అవుతాయో తెలియదు.కానీ హిట్ అయినా సినిమాకు కాంతారా మాత్రం గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.ఈ నాలుగు సినిమాలు ఎంత వసూళ్లు చేస్తాయో తెలియదు కానీ.ఈ సినిమాను మాత్రం ప్రభావితం చేయలేరు అని క్రేజ్ చూస్తుంటేనే తెలుస్తుంది.మరి దీపావళి వంటి పండుగ రోజుల్లో ఈ సినిమా ఎన్ని కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube