యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) టాలీవుడ్ ఇండస్ట్రీలోని అత్యంత ప్రతిభావంతులైన హీరోలలో ఒకరు కాగా జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.అయితే టెంపర్ సినిమా నుంచి ఆర్.
ఆర్.ఆర్ వరకు హీరోగా తారక్ ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నా సోలో హీరోగా తారక్ కు భారీ ఇండస్ట్రీ హిట్ ఖాతాలో చేరాలని ఫ్యాన్స్ ఆకాంక్ష అనే సంగతి తెలిసిందే.

ఆర్.ఆర్.ఆర్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచినా ఆ క్రెడిట్ ను జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో వేయలేము.దేవర( Devara ), ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో, వార్2 సినిమాలతో తారక్ ఖాతాలో అరుదైన రికార్డులు చేరడం ఖాయమని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
తారక్ సినిమాలకు పని చేస్తున్న దర్శకులు సైతం ఊహించని స్థాయిలో టాలెంట్ ఉన్న దర్శకులు అనే సంగతి తెలిసిందే.

అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ కు 2024 సంవత్సరం మెమరబుల్ ఇయర్ గా నిలిచే ఛాన్స్ ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.ఎన్టీఆర్ సొంత బ్యానర్ లో నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.ఈ విధంగా చేయడం వల్ల రిస్క్ తీసుకోవడంతో పాటు సినిమా హిట్టైనా ఫ్లాపైనా డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు నష్టపోయే ఛాన్స్ అయితే ఉంది.
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లానింగ్స్ కూడా వేరే లెవెల్ లో ఉన్నాయని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.రామ్ చరణ్ ( Ram Charan )లా తారక్ కూడా హాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెడుతున్నారని త్వరలో ఆ ప్రణాళికలకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తారని సమాచారం అందుతోంది.
ప్రముఖ బాలీవుడ్ బ్యానర్లు సైతం తారక్ తో సినిమాలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథ మరీ అద్భుతంగా ఉంటే మాత్రమే కొత్త సినిమాలకు ఓకే చెబుతున్నారు.