కేంద్ర కేబినేట్ పై వేటు పడనుందా..?

కేంద్రంలో బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినేట్ ను విస్తరించింది.బీజేపీ ఏ పని చేసినా.

అందులో ఏదో ఒక అంతరార్థం ఉంటుంది.అందుకే ఎన్నికల ముందు ముఖ్యమంత్రులను మార్చడం షరా మామూలే.

ఇటీవల గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, గోవా, మధ్య ప్రదేశ్ లలో కూడా ఇదే ఫార్ములా ఉపయోగించి సక్సెస్ అయింది.దాంతో ఇప్పుడు అదే ఫార్ములాను.

కేంద్ర కేబినేట్ లోనూ వాడాలని ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.లోక్ సభ ఎన్నికల ముందే.

Advertisement

కేబినేట్ ను విస్తరించాలని చూస్తున్నట్టు తెలస్తోంది.దానికి తోడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలం కూడా జనవరి 20తో ముగుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.

దాంతో ఎవరెవరికీ ఏ ఫోర్ట్ ఫోలియో ఇస్తారు అనేదానిపై ఇప్పటికే ఊహాగానాలు పెరిగిపోయాయి.ఇక 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీలో, ప్రభుత్వంలో విస్తరణ ఉంటుందని కూడా భావిస్తున్నారు.

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన కొంతమంది కొత్త ఎంపీలకు మంత్రివర్గంలో అవకాశం లభించవచ్చని తెలుస్తోంది.

అంతే కాకుండా ఏపీ నుంచి జీవీఎల్ కు మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.తెలంగాణాలో కిషన్ రెడ్డికి, ఏపీలో జీవీఎల్ కు పదవులు ఇస్తే.పార్టీ పుంజుకునే అవకాశం ఉందని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

రాజాసాబ్ సినిమా వచ్చేది అప్పుడేనా..?మారుతి ఎందుకంత స్లో గా వర్క్ చేస్తున్నాడు...
సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మరి ఈ సారి ఎన్నికలు మాత్రమే టార్గెట్ గా కాకుండా.వివిధ రాష్ట్రాల్లో పాగా వేసేందుకు వీలుగా విస్తరణ ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

అయితే.మోదీ షాల ద్వయం ఒక నిర్ణయం తీసుకున్నాక.

అధికారిక ప్రకటన వచ్చే వరకు అది ఏంటనేది ఎవరికీ తెలియదు.మరి విస్తరణ విషయంలోనూ వేటిని పరిగనలోకి తీసుకుంటారు అనేది విశ్లేషకులకు సైతం అర్థం కాకుండా ఉంది.

తాజా వార్తలు