నాస్తిక వాదమా..? దానికి జై భీమ్ ఎందుకు..?

దేశంలో నాస్థిక వాదం పేరుతో నమ్మకాలను దూసిస్తూ వచ్చిన చాలా మంది.కొంచం హద్దుల్లోనే వచ్చారు.

 Atheism Argument Why Jai Bheem , Atheist, Bhairi Naresh, Jai Bheem, Hindu Devot-TeluguStop.com

అప్పట్లో నాస్తిక వాదం అంటే మూఢ నమ్మకాలను వ్యతిరేకించడం.ప్రజల్లో చైతన్యాన్ని తీసుకు రావడం.

అయితే కాలం మారుతున్న కొద్ది.ఆ వాదం వెర్రి తలలు వేస్తూ వచ్చింది.

నానాటికి మత మనోభావాలను టార్గెట్ చేస్తూ.విమర్శలు చేస్తూ వచ్చారు.

అయితే ఇన్నాళ్లు చూసి చూడనట్టు వ్వవహరించిన వారంతా ఇప్పుడు తిరుగుబాటు మొదలు పెట్టారు.

నిష్టతో మాల వేసి.

కామ క్రోదాలు, మదమాశ్చార్యాలను వదిలేసి.భక్తితో స్వామి సేవ చేసుకునే వారికి సైతం కోపం తెప్పించే స్థితికి తీసుకుని వచ్చారు.ఎంత శాంతి మంతులైనా హద్దు దాటితే.శాంతాన్ని పక్కన పెట్టాల్సిందే అని మయన్మార్ మనకు నేర్పుతుంది.శాంతిగా ఉండే బౌద్దుల మీదకు దాడి చేసినందుకు.వారు కత్తులు పట్టి శత్రువులను సరిహద్దులు దాటించారు.

అలాగే నిష్ఠతో ఉండే స్వాములు సైతం కోపంతో ఊగిపోయారు.తన దేవున్ని అవమానకరంగా మాట్లాడిన వ్యక్తులపై ఉద్యమం చేస్తూనే.

గట్టిగా దండించారు.

ఇదంతా ఒక ఎత్తైతే.

నాస్తిక వాదం పేరును వాడుకుంటూ.అందులో అంబేద్కర్ పేరును చూపిస్తున్నారు.

ఏనాడు అంబేద్కర్ మత మనోభావాల గురించి మాట్లాడలేదు.అంతే కాకుండా మతం మారాలని ఎందరో అడిగినా ఆయన సున్నితంగా తిరస్కరించి.

బౌద్ద మతాన్ని స్వీకరించారు.అలాంటి నాయకుడి పేరుపై నాస్తిక వాదం పేరుతో విమర్శలు చేస్తుండటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జై బీమ్ అంటూనే.మతాల మనోభావాలతో ఆడుకుంటే.

ముందు ముందు ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube