మానవ మనుగడ 'బెన్ను' తో అంతరించపోనుందా..?!

రానున్న రోజుల్లో భూమి అంతరించపోతుంద అసలు మనిషి అనేవాడు భూమ్మీద కనిపిస్తాడా లేదా అనే భయం ఇప్పుడు అందరిలోనూ కలుగుతుంది.

ఒకప్పుడు అంతరించిపోయిన డైనోసార్ల మాదిరిగానే మానవ మనుగడ కూడా నాశనం అయిపోతుందా అనే ప్రశ్నలు అందరిని తలచి వేస్తున్నాయి.

అసలు ఇప్పుడు ఈ గందరగోళం అంతా ఏంటి అని అనుకున్నారా.? రానున్న రోజుల్లో భూ గ్రహాన్ని ఒక అతి భారీ గ్రహశకలం ఒకటి ఢీ కొట్టనుందని నాసా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.అలాగే భూమికి చేరువగా వస్తున్న గ్రహశకలంకు బెన్ను అని పేరు పెట్టారు.

ఇది ఒక ఆస్టరాయిడ్‌ అని దీనిపై నాసా సైంటిస్టులు పరిశోధనలు జరుపుతున్నారని వారు తెలిపారు.నాసా శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం 2016లో బెన్ను గ్రహ సకాలం ఉన్న ప్రాంతానికి నాసా శాస్త్రవేత్తలు ఒసిరిస్‌-రెక్స్‌ అనే వ్యోమనౌకను పంపడం జరిగింది.

ఆ నౌక 2018 డిసెంబర్‌లో బెన్ను ఉన్న ప్రాంతానికి చేరుకొని చేరుకున్న గ్రహశకలం పై పరిశోధనలో భాగంగా అక్కడ ఉన్న రాళ్ల శాంపిల్స్‌ ను, ఇంకా మట్టిని తీసుకుని మళ్ళీ అంతరిక్షం నుంచి భూమివైపు 2020 అక్టోబర్‌ లో బయలుదేరింది.ఆ నౌక మళ్ళీ మన భూమి పైకి 2023 సెప్టెంబర్‌ లో వస్తుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Advertisement

ఆ నౌక భూమికి భూమి మీదకి వచ్చిన తరువాత బెన్ను గ్రహశకలం దగ్గర నుండి తీసుకుని వచ్చిన శాంపిల్స్‌ పై పరిశోధనలు చేయనున్నారు నాసా శాస్త్రవెత్తలు.ప్రస్తుతానికి ఒసిరిస్ రెక్స్ అనే అంతరిక్ష నౌక అందించిన సంచారం బట్టి వచ్చే శతాబ్దంలో బెన్ను గ్రహశకలం భూమిని ఢీకొడుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు.

బెన్ను అనే గ్రహశకలం 2135 నాటికి భూగ్రహం దగ్గరగా వచ్చి భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.మొదట్లో 2175 నుండి 2199 సంవత్సరాల మధ్యలో ఈ బెన్ను భూమిని ఢీకొట్టే అవకాశం అలాగే 2,700లో ఒక వంతు ఉందని సైంటిస్టులు అనుకున్నారు.కానీ శాత్రవేత్తల అంచనాలను తారుమారు చేస్తూ బెన్ను భూమిని గుద్దే అవకాశం ఉందని అంటున్నారు.2182వ సంవత్సరం, సెప్టెంబర్‌ 24 బెన్ను గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం 1,750లో ఒక వంతు ఉందని అంటున్నారు. అలాగే 2135వ ఏడాదిలో బెన్ను గ్రహ శకలం భూమికి అతి దగ్గరగా వస్తుందని సైంటిస్టులు అంటున్నారు.

ఇలా గాని జరిగితే మానవ మనుగడ అంతరించిపోవడం ఖాయం అంటున్నారు శాస్త్రవేత్తలు.

కారు బానెట్‌పై చిన్నారి కూర్చోబెట్టి రోడ్డుపై ఏకంగా..? (వీడియో)
Advertisement

తాజా వార్తలు