2020 సంవత్సరంలో కరోనా మహమ్మారి విజృంభణ వల్ల ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లాలంటే కూడా భయాందోళనకు గురైన సంగతి తెలిసిందే.నవంబర్, డిసెంబర్ నెలల్లో కరోనా కేసులు తగ్గడంతో ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపారు.
అయితే గత మూడు రోజుల నుంచి మళ్లీ కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.అదే సమయంలో ఈ ఏడాది ప్రతి నెలా ఎన్ని సినిమాలు విడుదలవుతున్నా ఒక్క సినిమా మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్టవుతోంది.
జనవరి నెలలో చాలా సినిమాలు విడుదలైనా క్రాక్ సినిమా మాత్రమే నిర్మాతలకు , డిస్ట్రిబ్యూటర్లకు బ్లాక్ బస్టర్ హిట్ ను ఇచ్చి కమర్షియల్ హిట్ గా నిలిచింది.ఫిబ్రవరి నెలలో విడుదలైన సినిమాల్లో ఉప్పెన సినిమా మాత్రమే ఊహించని స్థాయిలో కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఈ నెలలో కూడా చాలా సినిమాలు విడుదలైనా జాతిరత్నాలు సినిమాకు మాత్రమే బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు భారీగా కలెక్షన్లు వచ్చాయి.

ప్రతి నెల ఒక సినిమా మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ అవుతూ మిగిలిన సినిమాలు యావరేజ్ లు, ఫ్లాపులు అవుతూ ఉండటంతో ఆ ఫ్లాప్ సెంటిమెంట్ కు నితిన్ బ్రేక్ వేస్తారా ? లేదా ? అని ఫ్యాన్స్ మధ్య చర్చ జరుగుతోంది.నితిన్ నటించిన లవ్ స్టోరీలలో ఎక్కువ సినిమాలు హిట్ కావడంతో రంగ్ దే ఖచ్చితంగా హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మరి రంగ్ దే ఫ్లాప్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
మరోవైపు రంగ్ దే సినిమాకు పోటీగా అరణ్య సినిమా విడుదల కాగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం లేదు.తరుణ్ నువ్వే కావాలి, పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలలా రంగ్ దే హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తుండగా సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.