ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో పొత్తుల విషయంలో బిజెపి వైఖరి ఏమిటనేది ఎవరికి అంతుపట్టడం లేదు టిడిపి, జనసేన( TDP, Jana Sena) పార్టీ పొత్తులు పెట్టుకున్నాయి.జనసేనతో బిజెపి పొత్తు కొనసాగిస్తుంది.
అయితే టిడిపి ,జనసేన కూటమిలో బిజెపి చేరేందుకు ముందుగా సానుకూలత వ్యక్తం చేసినట్టుగా సంకేతాలు ఇచ్చింది.ఈ మేరకు టిడిపి అధినేత చంద్రబాబును ఢిల్లీ రావాల్సిందిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah) ఆహ్వానించారు.
అయన ఆహ్వానం మేరకు ఢిల్లీకి వెళ్లి పొత్తుల విషయమై చంద్రబాబు చర్చించారు.ఇక ఆ తర్వాత ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ, టిడిపి ఇటు బిజెపి సైలెంట్ అయిపోయాయి.
అసలు పొత్తు పెట్టుకునే ఉద్దేశం ఉందో లేదో బిజెపి అగ్ర నేతలు ఎవరు క్లారిటీ ఇవ్వడం లేదు.ఈ విషయం లో ఇంకా క్లారిటీ రాకపోవడంతోనే అటు టిడిపి అధినేత చంద్రబాబు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపి నిర్ణయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.
ఇప్పటికే ఈ రెండు పార్టీలు మొదటి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి.
బిజెపి నిర్ణయం తేలిన తర్వాత పూర్తిస్థాయిలో జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి.అయితే బిజెపి వైఖరి క్లారిటీ వచ్చిన తర్వాతే జనసేన, టిడిపిలు రాజకీయంగా స్పీడ్ పెంచే ఆలోచనతో ఉన్నాయి.దీంతో ఏపీ బీజేపీ అధ్యక్షురాలి హోదాలో ఉన్న పురందేశ్వరిపైన ఒత్తిడి పెరిగిపోతోంది.
పొత్తుల విషయంలో బిజెపి అధినేతల వైఖరి ఏమిటి ? రాష్ట్ర అధ్యక్షురాలిగా మీ వైఖరి ఏమిటి ? తాము క్షేత్రస్థాయిలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది క్లారిటీ ఇవ్వాల్సిందిగా పురందేశ్వరిపైన బీజేపీ రాష్ట్ర నాయకులు ఒత్తిడి చేస్తున్నారు అయితే ఈ విషయంలో పురందరేశ్వరి ఏం చెప్పలేని పరిస్థితి.
ఇదిలా ఉంటే ఈరోజు ఏలూరులో జరిగే పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్రమంత్రి రాజనాథ్ సింగ్( Rajnath Singh) రానున్నారు ఆయన పాల్గొనే బహిరంగ సభలోనే పొత్తుల విషయమై క్లారిటీ ఇస్తారని, ఏపీ బీజేపీ నేతలతో పాటు టిడిపి జనసేన పార్టీలు భావిస్తున్నాయి.ఏలూరు మీటింగ్ లోనే పొత్తులపై తమ వైఖరి ఏమిటి అనేది రాజనాథ్ సింగ్ ద్వారానే చెప్పింది పొత్తులపై క్లారిటీ ఇస్తారని అంతా భావిస్తున్నారు.