అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన దేశముదురు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి హన్సిక.ఇలా మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈమె అనంతరం తెలుగులో వరుస సినిమాలలో నటిస్తూ సందడి చేశారు.
ఇకపోతే తెలుగులో మాత్రమే కాకుండా తమిళ సినిమాలలో కూడా నటించి ఎంతో గుర్తింపు సంపాదించుకున్న హన్సిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే ఈమె తన స్నేహితుడు బిజినెస్ పార్టనర్ అయినటువంటి సోహెల్ అనే వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నారని ఈమె అధికారికంగా వెల్లడించారు.
ప్యారిస్ లో ఈఫిల్ టవర్ ఎదుట తన ప్రియుడు తనకు ప్రపోజ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరికీ తనకు కాబోయే భర్తను పరిచయం చేశారు.సోహైల్ తనకు స్నేహితుడు మాత్రమే కాకుండా బిజినెస్ పార్ట్నర్ అనే విషయం మనకు తెలిసిందే.
ఇలా స్నేహితులుగా ఉన్నటువంటి ఈ జంట డిసెంబర్ 4వ తేదీ జైపూర్ లోని ఒక పురాతన ప్యాలెస్ లో ఘనంగా వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది.ఇకపోతే వివాహం తర్వాత హన్సిక సినిమాలలో నటిస్తారా లేక వ్యాపారాలలో బిజీ కానున్నారా అనే విషయంపై అభిమానులలో సందిగ్గత నెలకొంది.

ఈ క్రమంలోనే ఈ విషయంపై హన్సిక స్పందిస్తూ తాను పెళ్లయిన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పనని.అవకాశాలు వస్తే తప్పకుండా సినిమాలలో నటిస్తానని ఈమె తెలియజేశారు.మనం చేసే ప్రతి ఒక్క పని చాలా విలువైనది పెళ్లయిన తర్వాత ఆ పని చేయకూడదు అనే నియమ నిబంధనలు తనకేమీ లేవని, పెళ్లి జరిగిన తర్వాత సినిమాలు మానేయాల్సిన పనిలేదంటూ ఈ సందర్భంగా హన్సిక తెలియజేయడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.







