నల్గొండ జిల్లా మునుగోడు మండలం చండూరులో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.ఓ పక్క మునుగోడు ఉపఎన్నిక కొనసాగుతుండగా.
మరోపక్క చండూరులో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది.రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.
దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.స్థానికేతరులు డబ్బులు పంచుతున్నారని టీఆర్ఎస్ కార్యకర్తల ఆరోపిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు.