ప్రతీ ప్రభుత్వం ప్రజలకు ఏదో చేసేస్తాం, ఎంతో చేసేస్తాం అంటూనే ఎన్నికల బరిలోకి దిగుతుంది.తీరా అధికారంలోకి రాగానే హామీలను మరచిపోయి అధికారాన్ని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచన చేస్తుంది.
అయితే గత ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అంటే 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా బరిలోకి దిగిన వెంటనే అభివృద్ది పనులపై భారీ ఆలోచనే చేసి ముందుకు దూసుకుపోయారు.దాదాపు మొదటి ఆరు నెలల్లోనే మంచి అభివృద్ది సాదించి ప్రజల్లో జననేత గా చిరకాలం గుర్తు ఉండిపోయారు.
ఇంతవరకు ఒకే మరి ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది ఏమిటి? ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఆరు నెలలు గడిచినా ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, ప్రతీ జిల్లాలో, ఎక్కడ చూసినా అనేక సమస్యలు ఉన్నాయి.ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీలు ఇలా ఎన్నో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రభుత్వం మాత్రం శంకుస్థాపనలు చేసుకుంటూ ముందుకు పోతుంది.
అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది వైఎస్ఆర్ అధికారం చేపట్టే సమయానికి రాష్ట్రం పూర్తి స్వింగ్ లో ఉంది, మిగులు బడ్జెట్ తో మంచి అవకాశం ఉంది.అందుకే వైఎస్ఆర్ ఏం చెయ్యాలన్న ఆలోచించే పనిలేదు, 2004ముందు టీడీపీ ప్రభుత్వం కూడబెట్టిన సొమ్మును వైఎస్ఆర్ ఖర్చుపెట్టాడు, ఇక ఇప్పుడు చూస్తే రాష్ట్రం విడిపోయి పైసా చేతులో లేదు.
మరి ఇలాంటి సమయంలో మొదటి ఆరు నెలల్లోనే అభివృద్ది ఎలా కనిపిస్తుంది అన్నది తెలుగుదేశం వారి వాదన.నిజమే వారి మాటల్లోనూ నిజం లేకపోలేదు.మరి రానున్న 4సంవత్సరాల 6నెలల్లో ఎలాంటి అభివృద్ది జరుగుతుందో చూద్దాం.







