పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రేక్షకులలో అభిమానులే కాకుండా, ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.వారిలో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అభిమాని బండ్ల గణేష్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేష్ వీరాభిమాని. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈశ్వరా.పరమేశ్వర.పవనేశ్వరా… అన్న డైలాగ్స్ తో వేదిక మొత్తం దద్దరిల్లేలా చెప్పాడు.మరి అంత గొప్ప అభిమాని అయినటువంటి బండ్ల గణేష్ ఈసారి రిలీజ్ కాబోతున్న భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ స్పీచ్ ఉండబోతుందా లేదా అనే విషయం నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది.
సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సారి జరగబోయే భీమ్లా నాయక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ స్పీచ్ ఉండబోదు అనే తెలుపుతున్నారు.
దీనికి కారణం త్రివిక్రమ్ కు తనకు మధ్య ఒక వివాదం ఇంకా పరిష్కారం కాలేదంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.అందుకే ఈసారి భీమ్లా నాయక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ స్పీచ్ ఉండబోదని సినీ వర్గాలు తెలుపుతున్నాయి.
అందుకే ఈసారి బండ్ల గణేష్ స్థానంలో హైపర్ ఆది స్పీచ్ ఇవ్వబోతున్నట్లు సినీ వర్గాల్లో వినిపిస్తుంది.
మరి బండ్ల గణేష్ పంచు డైలాగులు పవన్ కళ్యాణ్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో లేకపోతే ఎలా అని అంటున్నారు కొందరు పవన్ కళ్యాణ్ వీరాభిమానులు.పవన్ కళ్యాణ్ కోసం వివాదాన్ని పక్కన పెట్టి బండ్ల గణేష్ వస్తాడా.త్రివిక్రమ్ కారణంగా భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు దూరంగా ఉంటాడా అనేది చూడాల్సి ఉంది.
ఏది ఏమైనా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఆ కిక్కే వేరని కొందరు అభిమానుల అభిప్రాయం.