పవన్ కళ్యాణ్ కు ఎంతో మంది వీరాభిమానులు ఉంటారు.సామాన్య ప్రేక్షకులు కాదు అటు సినీ సెలబ్రిటీలు సైతం అభిమానులుగా ఉంటారూ.
ఇక అలాంటి వారిలో త్రివిక్రమ్ ఒకరు.త్రివిక్రమ్ వీరాభిమాని కాదు అంతకు మించి అనే చెప్పాలి.
పవన్ కళ్యాణ్ పై త్రివిక్రమ్ కు ఉన్న అభిమానాన్ని మాటల్లో చెప్పడం చాలా కష్టం.ఇక పవన్ కళ్యాణ్ కు ఉన్న మంచి స్నేహితుడు కూడా త్రివిక్రమ్ కావడం గమనార్హం.
ఇక వీరిద్దరి ఆలోచనలు కూడా ఒకే లాగా కనిపిస్తూ ఉంటాయి.అయితే పవన్ కళ్యాణ్ ఏ సినిమాలో నటించిన ఆ సినిమా ఈవెంట్ కు త్రివిక్రమ్ తప్పకుండా వస్తాడు.
కేవలం రావడంతో ఊరుకోడు ఒక పవర్ ఫుల్ స్పీచ్ తో పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ కూడా ఉత్తేజపరుస్తూ ఉంటాడు.మాటల మాంత్రికుడు స్పీచ్ ఏ రేంజ్ లో ఉంటుంది అన్నది తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
పవన్ కళ్యాణ్ గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ ఉంటే గంటల తరబడి అయినా సరే ఆసక్తిగా వినాలి అనిపిస్తూ ఉంటుంది.అంత గొప్పగా పవన్ కళ్యాణ్ పై ఉన్న తన అభిమానాన్ని స్పీచ్ లో చెబుతూ ఉంటాడు త్రివిక్రమ్.
ఇకపోతే ఇటీవల భీమ్లా నాయక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.ఇక ఈ సినిమా త్రివిక్రమ్ పర్యవేక్షణలో తెరకెక్కడం తో.ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాటల మాంత్రికుడు కూడా వచ్చేశాడు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గురించి త్రివిక్రమ్ సాలిడ్ స్పీచ్ ఇస్తాడని అభిమానులు అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూసారు.కానీ ఈవెంట్ మొత్తం కూడా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎంతో సైలెంట్ గా ఉండిపోవడం చర్చనీయాంశంగా మారిపోయింది.త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు స్పీచ్ ఇవ్వలేదు అని అందరూ చర్చించుకుంటున్నారు.
అయితే త్రివిక్రమ్ సైలెన్స్ వెనుక ఒక పెద్ద కారణమే ఉంది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
త్రివిక్రమ్ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావద్దంటూ నన్ను బెదిరించాడని.కానీ నాకు రావాలని ఉంది అంటూ బండ్ల గణేష్ ఆడియో ఒకటి వైరల్ గా మారిపోయింది.త్రివిక్రమ్ మాట్లాడుతూ ఉంటే బండ్ల గణేష్ అంటూ పెద్దగా అరవండి అంటూ ఆడియో లో ఉంది ఒకవేళ త్రివిక్రమ్ మాట్లాడుతున్న సమయంలో నిజంగానే ప్రేక్షకులు అరుస్తారని భావించి.
త్రివిక్రమ్ మాట్లాడకుండానే సైలెంట్ గా ఉన్నాడు అనే టాక్ వినిపిస్తోంది.అంతేకాకుండా త్రివిక్రమ్ బండ్ల గణేష్ మధ్య వివాదాలు కొనసాగుతున్నాయనీ టాక్ వినిపిస్తుంది.ఇక ముందుగా యాంకర్ సుమకి త్రివిక్రమ్ ను పిలవద్దు అని చెప్పిన కారణంగానే సుమ కూడా ఎక్కడా మాట్లాడాలి అంటూ త్రివిక్రమ్ను ఒత్తిడి పెట్టలేదు అని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.