Padmalaya Studio krishna :100 ల ఎకరాల భూమి ఉన్న కృష్ణకు సామాన్యుడిలా మహాప్రస్థానంలో అంత్యక్రియలు ఎందుకు ?

కృష్ణ తన కెరీర్ లో 350 సినిమాల్లో నటించారు.నిర్మాతల హీరో అనే పేరు ఉన్నప్పటికి ఆస్తులను సైతం బాగానే కూడబెట్టారు.

అయన పేరు మీద చాల ఆస్తులతో పాటు వందల ఎకరాల్లో భూములు ఉన్నాయ్.హైదరాబాద్ లో చెన్నై నుంచి వచ్చాక కృష్ణ తన సొంత సినిమాల షూటింగ్ కోసం పద్మాలయ స్టూడియో నిర్మించుకున్నాడు.

అది ప్రస్తుతం సినిమా షూటింగ్స్ చేసుకోవడం లేదు.అయితే అందులో ఉన్న ఎన్నో ఎకరాల భూమిని అపార్ట్మెంట్స్ కట్టడానికి, కమర్షియల్ కాంప్లెక్స్ ల కోసం కృష్ణ తీసేశాడని వార్తలు వస్తున్నాయి.

కొంత భాగం ఇలా పోయినప్పటికి ఇంకా 5 ఎకరాల స్థలం మిగిలి ఉందట.ఇక పద్మాలయ స్టూడియోస్ అమ్మగా వచ్చిన డబ్బుతో దానికి ప్రత్యామ్న్యాయంగా ఆ ప్రాంతానికి అతి సమీపం లో మహేశ్వరం ఏరియా లో కొన్ని ఎకరాల స్థలాన్ని కృష్ణ కొనుగోలు చేసాడు.

Advertisement

ఇక మహేష్ బాబు సైతం అందుకు కూత వేటు దూరంలో 30 ఎకరాల స్థలాన్ని కొనుక్కున్నాడు.ఇక ఇవి కాకుండా హైదరాబాద్ లో ఎన్నో ఏళ్ళ నుంచి వారి కొన్ని స్థలాలు సిటీ బయట వందల ఎకరాల్లో పంట పొలాలు కూడబెట్టారు.

ఇక నానక్ రామ్ గూడా ఫామ్ హౌస్ కూడా పదెకరాల స్థలంలో ఉన్న సంగతి మనకు తెలిసిందే, ఇన్ని ఎకరాల స్థలం, ఇంత ప్రయివేట్ భూములు, ఫామ్ హౌస్ లు ఉన్నప్పటికి కృష్ణ కి అన్యాయం జరిగింది.

ఇంత ప్లేస్ పెట్టుకొని అతి సామాన్యుడిగా కృష్ణ అంత్యక్రియలు ఎందుకు మహా ప్రస్థానం లో చేసారు అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.అయన స్థలంలో ఆయన్ను ఖననం చేయడానికి ఎందుకు కుదరలేదు.విజయ నిర్మల కోసం నరేష్ ఇక ఇవన్ని కాసేపు పక్కన పెడితే ఇప్పుడు జరిగిన డ్యామేజీ ని కప్పి పుచ్చడానికి కృష్ణ పేరు పైన పద్మాలయ లో మిగిలిన ఐదెకరాల స్థలంలో మెమోరియల్ కట్టాలనే ప్లాన్ లో ప్రస్తుతం కృష్ణ కుటుంబ సభ్యులు ఉన్నారని తెలుస్తుంది.

మరి ఈ ప్రషన్లకు సమాధానం చెప్పడానికి ఎవరు సిద్ధంగా లేకపోయినా కృష్ణ లని మహానుభావుడికి మాత్రం అన్యాయం జరిగింది అనే అనుకోవాలి.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు