ఏపీలో రానున్న 2024 ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ బ్లాక్ బాస్టర్ రావడం ఖాయమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.ఏపీలో మోదీ మ్యాజిక్ పని చేస్తుందన్నారు.
బీజేపీ- జనసేన భాగస్వామ్యంతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన తర్వాత ప్రజల్లో మార్పు కనిపిస్తోందన్నారు.
జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై త్వరలోనే ఛార్జిషీట్ దాఖలు చేస్తామని తెలిపారు.అటు టీడీపీ కూడా పూర్తి అభద్రతా భావంతో ఉందని పేర్కొన్నారు.
టీడీపీకి సొంత ప్రయోజనాలు తప్ప.ప్రజల ప్రయోజనాలు పట్టవని విమర్శించారు.
వైసీపీ, టీడీపీ రెండూ కుటుంబ పార్టీలని, కుట్ర పార్టీలని మండిపడ్డారు.