వైసీపీ ప్ర‌భుత్వానికి ఎందుకీ ద్వంద్వ వైఖ‌రిః ప‌వ‌న్ క‌ల్యాణ్

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ద్వంద్వ వైఖ‌రిని అవ‌లంభిస్తోంద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆరోపించారు.

ప్లాస్టిక్ ఫ్లెక్సీల‌పై నిషేధం విధిస్తూ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై ఆయ‌న స్పందించారు.

విశాఖ‌లో పారిశ్రామిక కాలుష్య నివార‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోలేదు.విష‌వాయువులు లీకేజ్, మ‌ర‌ణాలు అరికట్టేందుకు మాత్రం జాగ్ర‌త్తలు తీసుకోలేద‌ని విమ‌ర్శించారు.

కానీ ప్లాస్టిక్ ఫ్లెక్సీలను మాత్రం నిషేధించార‌ని ఎద్దేవా చేశారు.రుషికొండ‌ను ఆక్ర‌మించి విధ్వంసం సృష్టించార‌న్న ఆయ‌న‌.

ఒక్క‌సారిగా ప‌ర్యావ‌ర‌ణంపై ప్రేమ పుట్టుకొచ్చిందా.? అని ప్ర‌శ్నించారు.

Advertisement
తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

తాజా వార్తలు