కళ్యాణి అలియాస్ కావేరి… కేరళ లో పుట్టిన ఈ అమ్మడు మలయాళం లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చాల సినిమాల్లో నటించింది.యుక్త వయసు వచ్చాక చెల్లి గా, చిన్న చిన్న రోల్స్ లో దాదాపు పదేళ్ల పాటు కనిపించాక శేషు సినిమా ద్వారా తెలుగు లో తొలిసారి లీడ్ హీరోయిన్ గా కనిపించి అందరిని ఆకర్షించింది.
మలయాళ సినిమాల్లో మొదట నటించిన ఆమెకు బ్రేక్ ఇచ్చింది మాత్రం తెలుగు ఇండస్ట్రీ.శేషు సినిమా ద్వారా ఆమె మొదటి సారి కనిపించిన రాజశేఖర్ కన్నా కూడా కళ్యాణి కి( Kalyani ) మంచి మార్కులు పడ్డాయి.
దాంతో తనకు వంశి దర్శకత్వం లో నటించే అవకాశం లభించింది.రవి తేజ సరసన ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు( Avunu Valliddaru Ishta Paddaru ) అనే సినిమాలో నటించడం తో ఆ సినిమా ఘనవిజయం సాధించింది.
ఈ చిత్రానికి గాను కళ్యాణి నంది అవార్డు( Nandi Award ) గెలుచుకుంది.ఇక చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే ఈ చిత్రంలో మొత్తం బ్లాక్ మరియు వైట్ అనే థీమ్ తో సినిమా ఉంటుంది.అయితే ఈ చిత్రంలో హీరోయిన్ కట్టుకున్న చీరలు మొత్తం నలుపు కాంబినేషన్ లో ఉండే కాటన్ చీరలు.ఈ సినిమా విజయం సాధించాక ఆ కాటన్ చీరలను పట్టుచీరల కన్నా కూడా విలువైనవి గా భావించి ప్రొడ్యూసర్ ని అడిగి మరి ఆ చీరలు మొత్తం ఇంటికి తీసుకెళ్లింది.
ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం తర్వాత ఆమె ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు.ఈ చిత్రం మాత్రమే కళ్యాణి నటించిన సినిమాలు వరసగా విజయవంతం అవుతూ వచ్చాయి.
ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం తర్వాత పెళ్ళాంతో పనేంటి, వసంతం, కబడ్డీ కబడ్డీ, దొంగోడు వంటి తెలుగు సినిమాలు వరసగా విజయం సాధిస్తూ వచ్చాయి.ఆ తర్వాత ఆమె మిగతా భాషల్లో కూడా బిజీ గా ఉంది.ఇలా కెరీర్ మొత్తం మీద తెలుగు, తమిళ్, మలయాళం లో చాలానే నటించింది.ఇక ఆమె నిర్మాతగా కూడా మారి కొన్ని సినిమాలను నిర్మించారు.ఈ దశలోనే పెళ్లి చేసుకొని ఆ తర్వాత భర్త సూర్య కిరణ్ కి ఆమెకు సమయాలు ఎదురు కావడం తో విడాకులు తీసుకున్నారు.ప్రస్తుతం ఆమె ఇప్పుడు ఒక సాలిడ్ కామ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు.
తల్లి పాత్రల్లో నటించడానికి కూడా సిద్ధంగా ఉంది.కళ్యాణి చివరగా 2019 లో యాత్ర సినిమాలో హీరోయిన్ కి మదర్ గా కనిపించారు.