గత సంవత్సరం దారుణమైన ఆటతీరుతో అభిమానుల ఆశలను అడియాశలు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్( Sunrisers Hyderabad ) ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలని గట్టిగా అనుకుంటోంది.సొంత గడ్డపై బరిలోకి దిగి ప్రత్యర్థులను చిత్తు చిత్తు చేయాలని అనుకుంటోంది కానీ ఈ సారి కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ కి గడ్డుకాలం తప్పేటట్టు కనబడడం లేదని కొంతమంది జోష్యం చెబుతున్నారు.
మరో 4 రోజుల్లో ఐపీఎల్ ( IPL )మొదలవనుంది.మార్చి 31 న చెన్నై సూపర్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగే మ్యాచుతో ఐపీఎల్ 2023 దిగ్విజయంగా ఆరంభం కానుంది.
అయితే.ఐపీఎల్ మొదటి వారం కొంత మంది సౌతాఫ్రికా సూపర్ స్టార్ బ్యాటర్లు ఆటకు దూరం కానున్నారు.దీంతో.ఆయా ఫ్రాంచైజీలకు కాస్త నష్టం వాటిల్లడం ఖాయం అని వినబడుతోంది.దక్షిణాఫ్రికా జట్టు ఆటగాళ్లు జాతీయ డ్యూటీలో బిజీగా ఉండడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది.ఆఫ్రికా జట్టు ప్రస్తుతం వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది.
దీని తర్వాత ఏప్రిల్ 2 వరకు నెదర్లాండ్స్‌తో 2 వన్డేలు ఆడాల్సి ఉంది.వన్డే వరల్డ్ కప్ 2023 దృష్ట్యా సౌతాఫ్రికాకి ఈ మ్యాచులు చాలా కీలకంగా మారాయి.
దీంతో.పూర్తి స్థాయి జట్టుతో వారు బరిలోకి దిగాలని అనుకుంటున్నారు.
దీంతో.ఐపీఎల్ ఫ్రాంచైజీలకు తొలి వారం షాక్ తప్పేట్టు కనబడడంలేదు.
ఆఫ్రికన్ ఆటగాళ్లు అందుబాటులో లేకుంటే ముఖ్యంగా ‘సన్ రైజర్స్ హైదరాబాద్’ ఎక్కువగా నష్టపోయే ప్రమాదం వుంది.ఈ ఫ్రాంచైజీ కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ కూడా తొలివారం అందుబాటలో లేకపోవడం ఆ ఫ్రాంచైజీకి గడ్డుకాలం అని చెప్పక తప్పదు.అంతేకాకుండా స్టార్ బ్యాటర్ హెన్రీ క్లాసెన్ రూపంలో కూడా మరో ఝలక్ వీరికి తగలనుంది.IPL 2023లో మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన ఇద్దరు ముఖ్యమైన ఆటగాళ్లు కూడా అందుబాటులో ఉండరు.
ఢిల్లీ పేస్ బ్యాటరీలో భాగమైన ఎన్రిక్ నార్ట్జే మరియు స్టార్ ఫాస్ట్ బౌలర్ లుంగి ఎన్‌గిడి తొలివారం దూరం కానున్నారు.ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ని ఆ దేవుడే కాపాడాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.