అడవి శేష్ హీరోగా మహేష్ బాబు నిర్మాతగా ఎంతో మంది ప్రజల ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాలను పణంగా పెట్టిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్. ఈ సినిమా నేడు ఎంతో గ్రాండ్గా రిలీజయింది అన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి ప్రేక్షకులలో.ఈ సినిమాను చూసేందుకు అందరూ తరలి థియేటర్లకు తరలివెళుతున్నారు.
ఇక 26/ 11 ముంబై దాడులకు సంబంధించి ఇక ఈ సినిమా తెరకెక్కింది అని చెప్పాలి.ఇక ఈ సినిమాలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ భార్య పాత్రలో సయి మంజ్రేకర్ నటించింది.
అయితే ఇక మేజర్ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడికి హృదయాన్ని హత్తుకుంటుంది అని చెప్పాలి.ఇలాంటి సమయంలో కొంతమంది ప్రేక్షకులలో కొన్ని డౌట్స్ కూడా వస్తున్నాయ్.అది ఏంటంటే 2008లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో సందీప్ ఉన్నికృష్ణన్ తో పాటు ఎంతోమంది సైనికులు చనిపోయారు.కానీ కేవలం సందీప్ ఉన్నికృష్ణన్ ఎందుకు అంత స్పెషల్.
ఆయన జీవిత కథ ఆధారంగానే ఎందుకు సినిమా తీశారు అనే ప్రశ్నలు కూడా తెర మీదకు వస్తున్నాయి.ఇక ఇది ఒక సగటు ప్రేక్షకుడికి సాధారణంగా వచ్చే ప్రశ్న అన్న విషయం తెలిసిందే.

ఇదే విషయంపై ఇటీవలె మేజర్ దర్శకుడు శశికిరణ్ క్లారిటీ ఇచ్చారు.అందరికీ సహజంగా ఒక ఇన్సిపిరేషన్ అనేది ఉంటుంది.ఫ్రీడమ్ ఫైటర్స్ చాలామంది ఉంటారు.కానీ దృష్టి అనేది ఒకరి పైన పడుతూ ఉంటుంది.అడవి శేషు లుక్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రకు చాలా దగ్గరగా ఉంటుంది.అలా అని ప్రాణాలర్పించిన మిగతా సైనికులను తక్కువ చేయడం లేదు.
ముందు ఫిలిం మేకర్స్ వాళ్ళ బయోపిక్ పైన కూడా చిత్రాలు నిర్మించే అవకాశం కూడా ఉంటుంది.

ఇక బయోపిక్ అనేది అందరూ సంతోషంగా తీయాల్సిన సినిమా.ఇక సందీప్ ఉన్నికృష్ణన్ కుటుంబం కూడా ఎంతగానో సహకరించింది.అది ఆయన హావభావాలు ఎలా ఉంటాయన్న విషయంపై మాకు వివరించారు.
ఇక వారి సహకారం లేనిదే ఈ బయోపిక్ మేము తెరకెక్కించే వాళ్ళం కాదు ఇంతకు మించి ఎక్కువ చెప్పలేను అంటూ శశికిరణ్ తిక్క క్లారిటీ ఇచ్చారు.