మలయాళి ముద్దుగుమ్మ సంయుక్త మీనన్( Samyuktha Menon ) టాలీవుడ్ లో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిందని అంతా భావించారు.బింబిసార సినిమాలో చిన్న పాత్రలో నటించిన సంయుక్త మీనన్ ఆ సినిమా మంచి ఫలితాన్ని దక్కించుకోవడం తో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు దక్కించుకుంది.
బింబిసార,( Bimbisara ) సార్( Sir ) మరియు విరూపాక్ష( Virupaksha ) సినిమాలు కూడా భారీ విజయాలను సొంతం చేసుకోవడం తో సంయుక్త మీనన్ కి స్టార్ లేడీ అంటూ పేరు దక్కింది.గోల్డెన్ లెగ్, లక్కీ బ్యూటీ అంటూ తెగ ఆకాశానికి ఎత్తారు.
కానీ ఈ మధ్య కాలంలో ఈమెకు కొత్త సినిమా ఆఫర్లు ఏమీ కూడా రావడం లేదు అంటున్నారు.ప్రస్తుతం సినిమాల్లో నటించక పోవడం తో అసలు ఏం జరిగింది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటి వరకు సంయుక్త మీనన్ కొత్త సినిమా లను కమిట్ అవ్వక పోవడం వెనుక కారణం ఏంటి అనేది కొందరు ప్రశ్నిస్తున్నారు.ఆ మధ్య ఒకటి రెండు సినిమా లకు సంబంధించిన చర్చలు జరిగాయి.కానీ ఇప్పటి వరకు ఆ కొత్త సినిమా లకు ఓకే చెప్పలేదు అనే టాక్ వినిపిస్తుంది.అసలు సినిమా లను ఈమె కమిట్ అవ్వడం లేదా లేదంటే ఈమెనే ఫిల్మ్ మేకర్స్ లైట్ తీసుకున్నారా అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న డెవిల్ సినిమా లో ( Devil Movie ) మాత్రమే ఈమె నటిస్తోంది.

అది కాకుండా మలయాళంలో అయినా సినిమా లు చేస్తుందా అంటే ఏమీ లేదు అంటున్నారు.మరి ఎందుకు సంయుక్త మీనన్ కొత్త సినిమాలు దక్కించుకోలేక పోతుంది అనేది చర్చ జరుగుతోంది.ఇప్పటి వరకు గోల్డెన్ లెగ్ బ్యూటీ అంటూ ప్రశంసలు దక్కించుకున్న సంయుక్త కి ఎందుకు ఆఫర్లు రావడం లేదు అనేది తెలియడం లేదు.
ముందు ముందు అయినా ఈమెకు కనీసం ఆఫర్లు వస్తాయా అనేది చూడాలి.గోల్డెన్ లెగ్ బ్యూటీ కాస్త స్టార్ హీరోల సినిమాల సినిమా లను సొంతం చేసుకునేది ఎప్పుడు అన్నట్లుగా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.