సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని వార్తలు ఎలా పుట్టుకు వస్తాయో ఏమో చెప్పలేము.తాజాగా తమిళ్ సూపర్ స్టార్ విజయ్ నటించిన లియో సినిమా లో రామ్ చరణ్ కీలకమైన గెస్ట్ రోల్ లో నటించాడు.
విక్రమ్ సినిమా లో ఎలా అయితే రోలెక్స్ పాత్ర మంచి ఆధరణ దక్కించుకుందో అలాగే లియో లో చరణ్ పాత్ర కచ్చితంగా ఓ రేంజ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అన్నట్లుగా ప్రచారం జరిగింది.లియో లో రామ్ చరణ్ నటించాడా అంటూ చాలా మంది అవాక్కయ్యారు.
లోకేష్ కనగరాజ్( Lokesh Kanagaraj ) అడిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతటి స్టార్ హీరోలు అయినా ఓకే చెప్పాల్సిందే.

అందుకే లియో సినిమా లో చరణ్( Ram charan ) నటించి ఉంటాడు అంటూ చాలా మంది కూడా నమ్మారు.కానీ అసలు విషయం ఏంటి అంటే లియో సినిమా లో చరణ్ నటించాడు.కనిపించబోతున్నాడు అనే వార్తలు పూర్తిగా అవాస్తవం.
అసలు ఇప్పటి వరకు లియో సినిమా యూనిట్ సభ్యులను కూడా రామ్ చరణ్ కలిసిందే లేదు అనేది వాస్తవం.ఈ విషయం ఇండస్ట్రీకి చెందిన చాలా మంది చెబుతున్నారు.
కానీ కొందరు ఇప్పటికి కూడా లియో సినిమా లో చరణ్ ఉన్నాడేమో అనే నమ్మకంతో ఎదురు చూస్తామని చెబుతున్నారు.

తెలుగు లో లియో ( Leo )కి పెద్దగా బజ్ క్రియేట్ అవ్వలేదు.ఆ బజ్ క్రియేట్ అవ్వడం కోసం ఇలాంటి పుకార్లు పుట్టించి ఉంటారు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి పుకార్లు పుట్టుకు రావడం కు కారణం కచ్చితంగా లియో సినిమా ను తెలుగు లో విడుదల చేయబోతున్న బయ్యర్లు లేదంటే తమ అభిమాన హీరో విజయ్ సినిమాకు తెలుగు లో మంచి బజ్ రావాలనే ఉద్దేశ్యంతో ఆయన ఫ్యాన్స్ పుకార్లను పుట్టించి ఉంటారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి వారు అనుకున్నది నెరవేరింది.మంచి గుర్తింపు రావడం తో పాటు చరణ్ ఉన్నా లేకున్నా కూడా లియో లో మ్యాటర్ ఉంటుందేమో అంటూ తెలుగు ప్రేక్షకులు కూడా ఒక అభిప్రాయం కు వస్తున్నారు.







