కలకత్తా లో పుట్టిన రీమాసేన్ ముంబై లో పెరిగి తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొన్నాళ్లపాటు తన ఆధిపత్యాన్ని చూపించింది.తెలుగు సినిమాల్లో ఉదయ్ కిరణ్ తో జోడి కట్టి బెస్ట్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న రీమాసేన్ తమిళనాడులో విషాలతో బెస్ట్ జోడి అనిపించుకుని ఎక్కువ సినిమాల్లో నటించింది.
తెలుగు లో చిత్రం, మనసంతా నువ్వే సినిమాలతో స్టార్ డం అందుకున్నాక హిందీ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
కానీ అక్కడ విజయవంతం కాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి తరలి వెళ్లి అక్కడ కొన్నాళ్లపాటు బాగానే రాణించింది.
తమిళ్ లో ఆమె నటించిన తొలి సినిమాలన్నీ కూడా విజయవంతం సాధించడంతో విశాల్ తో నటించే అవకాశం లభించింది.కొన్నాళ్లపాటు విశాల్ తో డేటింగ్ చేసిందని వార్తలు కూడా తమిళనాట గుప్పుమన్నాయి.
వీరు నటించిన పొగరు, ప్రేమ చదరంగం వంటి సినిమాలు విజయవంతం సాధించడంతో ఈ వార్తల జోరు మరింత పెరిగింది.అయితే రూమర్స్ ని విశాల్ రీమాసేన్ కొట్టిపారేసారు.
ఇక రీమాసేన్ కి వివాదాలేమీ కొత్త కాదు.

ఆమె సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాలంలో అందచందాలు ఆరబోయడానికి ఎలాంటి అభ్యంతరాలు పెట్టుకోలేదు అయితే ఒక మ్యాగజిన్ ముఖపత్రికపై అశ్లీల కరమైన భంగిమలో ఫోటో ప్రచురితం అవ్వడంతో కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.చివరికి బహిరంగంగా క్షమాపణ చెప్పడంతో ఈ వివాదం సర్డుమనిగుంది.ఏడాది పాటు ఈ విషయంపై అనేక వివాదాలు రాజుకున్నాయి ఇక ఇదే విషయంలో మరొక హీరోయిన్ శిల్పా శెట్టికి సైతం కోర్టు నుంచి చుక్కెదురైంది.

ఇక 2012లో సినిమాలకు గుడ్ బై చెప్పినా రీమాసేన్ నార్త్ ఇండియాలోని వ్యాపారవేత్త అయిన శివ కరణ్ సింగ్ ని పెళ్లి చేసుకుంది ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు ప్రస్తుతం తన ఫ్యామిలీ లైఫ్ లో ఏమన్నా బిజీగా ఉంది.ఇక రీమాసేన్ ఇప్పట్లో మళ్ళీ సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది.







