బోలెడంత బ్యాగ్రౌండ్ ఉంది.సినిమాలు ఎన్నైనా కమిట్ చేసే టైం ఉంది.అయినా కూడా మంచి టైం కలిసి రావాలి కదా.ప్రస్తుతం రామ్ చరణ్( Ram Charan ) కూడా ఆ టైం కలిసి రాక చాలా ఇబ్బందులు పడుతున్నాడు.కెరియర్ మొదటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే రామ్ చరణ్ సినిమా సినిమాకి మధ్య గ్యాప్ తీసుకుంటూ వస్తున్నాడు.మధ్యలో కొన్నాళ్లు బాగానే ఉన్నా మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చింది.
మరి చిరుత నుంచి ట్రిపుల్ ఆర్ వరకు రామ్ చరణ్ గ్యాప్ తీసుకున్న సినిమాలు ఏంటి? మరి ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి రామ్ చరణ్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి ? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరుత సినిమా( Chirutha Movie ) చేయగా 2007లో ఈ సినిమా విడుదల అయింది.ఆ తర్వాత మరో సినిమా కమిట్ అవ్వడానికి ఈ దాదాపు రామ్ చరణ్ రెండేళ్ల సమయం తీసుకున్నాడు.మగధీర సినిమా( Magadheera ) 2009లో వచ్చింది.2010లో ఆరెంజ్ సినిమా( Orange Movie ) చేసిన దాని ఆ పరాజయం తాలుకు భయంతో 2012 వరకు రచ్చ సినిమా వచ్చేదాకా అభిమానులు రెండేళ్ల పాటు ఎదురు చూశారు.అయితే ఆ తర్వాత గ్యాప్ ఇవ్వకూడదు అనుకున్నాడో ఏమో 2013లో ఒకేసారి 2 సినిమాలు తీశాడు.
నాయక్, తుఫాన్ వంటి సినిమాలతో ప్రేక్షకులకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఇచ్చాడు.ఇక 2014 నుంచి ఈ 2019 వరకు వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూనే వచ్చాడు.
ఈ గ్యాప్ లో ప్రతి ఏటా ఒక సినిమా వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు.

కానీ ఏ ముహూర్తాన ట్రిపుల్ ఆర్ సినిమా( RRR ) అనౌన్స్ అయిందో 2019 నుంచి 2022 వరకు ఒక్క చిత్రం కూడా విడుదలవలేదు.2022లోనే ఆ సినిమాతో పాటు ఆచార్య చిత్రం కూడా వచ్చింది.ఇప్పుడు మళ్లీ ఆచార్య సినిమా ( Acharya ) అయిపోయి రెండు సంవత్సరాలు గడుస్తుంది.
ఇంకా మరో ఏడాది పాటు ఆయన సినిమాలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.ఇక శంకర్ గేమ్ చేంజర్( Game Changer ) ఎప్పుడు విడుదలవుతుందో వారికే క్లారిటీ లేదు.
దీంతో పాటు బుచ్చిబాబు సినిమా కూడా ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పూర్తి చేసుకునే షూటింగ్ మొదలుపెట్టే పనిలో ఉన్నారు.ఇక 2025 సమ్మర్ లో సుకుమార్ పుష్ప సినిమా ముగించుకొని రాంచరణ్ సినిమాను మొదలుపెట్టే అవకాశం ఉంది.
ఈసారి గ్యాప్ వచ్చిన ఒకే ఏడాదిలో మూడు సినిమాలు విడుదల చేయాలని రామ్ చరణ్ భావిస్తున్నాడట.