ఇప్పటి వరకు జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నకల్లో ప్రతి అడుగు సంచలనంగా, వివాదాస్పదంగా మారిన ఎన్నికలు ఏవైనా ఉన్నాయంటే .ఈ మధ్య ముగిసిన మా ఎన్నికలని చెప్పొచ్చు.
సుమారు రెండుమూడు నెలలపాటు సినీ వర్గాల్లో సంచలనంగా మారిన .మా.ఎన్నికలు ముగిసిన విషయం విధితమే.అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు మధ్య జరిగిన పోరులో ప్రకాష్‌రాజ్ ఓటమి పాలయ్యాడు.
అయితే ఏదైనా ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చిన తరువాత గెలుపోటముల గురించి మాట్లాడతారు.కానీ, అంతా అయిపోయిన తరువాత ఓటమి పాలైన వారి గురించి మళ్లీ తెరమీదకు తెచ్చి మాట్లాడడం చర్చకు దారితీస్తోంది.
అంత పెద్ద నటుడు, అందరి మన్ననలు పొందిన ఆయన ఈ పిల్ల ఎన్నికలో ఓడిపోవడమేంటీ ? అన్నది హాట్ టాపిక్‌గా మారింది.
అయితే మా ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత ప్రకాష్‌రాజ్ ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అవి సంచలనంగా మారాయి.ఇదంతా పక్కన పెడితే మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సన్నిహితంగా ఉంటూ జాతీయ రాజకీయాలకు చోదకశక్తిగా ప్రకాశ్‌రాజ్ మారారు.
దీంతో ఆయన మళ్లీ వార్తల్లోకి ఎక్కి చర్ఛనీయాంశంగా మారాడు.మరి సీఎం కేసీఆర్‌కు అంత సన్నిహితమైన ఆయన మా ఎన్నికల్లో ఓడిపోవడమేంటనే ప్రశ్న అందరి మదులను తొలుస్తోంది.
కేసీఆర్ లాంటి అధినేతలకు ఎన్నికలు ఎలా డీల్ చేయాలో బాగా తెలుసు.ఆయన మా ఎన్నికలను తలచుకుంటే క్షణాల్లో తేల్చేస్తారు.

మరి అతనికి సన్నిహితంగా ఉన్న ప్రకాశ్ రాజ్ ఓడడమేంటీ అన్న ప్రశ్న తలెత్తక మానదు.అయితే ఎన్నికల వేళ మంత్రి కేటీఆర్ మద్దతు కోరినట్టు పుకార్లు రాగా ప్రకాశ్‌రాజ్ వాటిని కొట్టిపడేసిన విషయం విధితమే.కాగా తనకున్న పరిచయాలు, బలాన్ని వాడి మా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకోవడంలో ఫెయిల్ అయ్యారనే వాదన కూడా వస్తోంది.అయితే ప్రకాశ్‌రాజ్ ఎదుర్కొంటున్న ప్రతికూలతను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ ఏదైనా సహాయం కావాలా అని అడిగాడని, దానికి ప్రకాశ్‌రాజ్ నో చెప్పారని టాక్.
వ్యక్తిగత స్నేహాన్ని ఇందులోకి చొప్పించొద్దనే ఆ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.ఏదిఏమైనా సీఎం కేసీఆర్ లాంటి వారి బ్యాక్ గ్రౌండ్ ఉన్న ప్రకాష్ రాజ్ ఓడిపోవడం ఆయన నైతిక విలువలే కారణమని అందరూ భావిస్తుండడం కొసమెరుపు.