పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ప్రభాస్ వ్యక్తిగత జీవితంలో మాత్రం సెటిల్ కాలేదని చెప్పాలి.
ఈయన నాలుగు పదుల వయసులో ఉన్నప్పటికీ ఇంకా సింగిల్గానే ఉండడంతో ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈయన వాలకం చూస్తుంటే మాత్రం ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకొనేలా అసలు కనిపించడం లేదు.

ఈ విధంగా ప్రభాస్ పెళ్లి గురించి తరచూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.ఇక ఈయన నటి అనుష్క(Anushka) తో ప్రేమలో ఉన్నారంటూ కూడా వార్తలు వినిపించాయి.అయితే ఈ వార్తలను పూర్తిగా ఖండించి తను మంచి స్నేహితురాలు అని క్లారిటీ ఇచ్చారు.అయితే అనుష్క కంటే ముందుగానే ప్రభాస్ మరొక హీరోయిన్ తో ప్రేమలో పడ్డారు అంటూ కూడా వార్తలు వైరల్ అయ్యాయి.
ప్రభాస్ హీరోయిన్ త్రిష(Trisha) తో కలిసి మొదటిసారి వర్షం (Varsham) సినిమాలో నటించారు ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.

ఈ సినిమా సమయంలోనే ప్రభాస్ త్రిష ఇద్దరు కూడా ప్రేమలో పడ్డారని అనంతరం వీరిద్దరూ కూడా బుజ్జిగాడు( Bujjigadu ) పౌర్ణమి( Pournami ) వంటి సినిమాలలో నటించారు.అయితే పీకల్లోతూ ప్రేమలో ఉన్నటువంటి ప్రభాస్ త్రిష చివరికి బ్రేకప్ చెప్పుకున్నారు.ఇలా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకోవడానికి కారణం త్రిష చేసినటువంటి దారుణమైన మోసం అని చెప్పాలి.
త్రిష టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ప్రభాస్ తో ప్రేమలో ఉన్నారు అయితే ఈమె కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి అవకాశాలు అందుకోవడం కోసం హీరో విజయ్ దళపతితో( Vijay Thalapathy ) రహస్యంగా ప్రేమ ప్రయాణం కొనసాగించారట.

ఈ విధంగా అవకాశాల కోసం పెళ్లై పిల్లలు ఉన్నటువంటి హీరోతో ఇలా రహస్యంగా ప్రేమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉందనే విషయం ప్రభాస్ కి తెలియడంతో ఆమెను పూర్తిగా పక్కన పెట్టారని తెలుస్తోంది.ఇక ఈ విషయం తెలిసిన తర్వాత ప్రభాస్ ఇకపై ఎప్పుడూ కూడా తనతో సినిమాలలో నటించలేదు అదేవిధంగా పెళ్లి ప్రేమ అంటే ఇలాంటి మోసాలే ఉంటాయి అని భావించినటువంటి ప్రభాస్ ఇప్పటివరకు పెళ్లి గురించి ఆలోచించకుండా సింగిల్ గా గడుపుతున్నారని తెలుస్తుంది.