మే డే.అంటే అదేదో కార్మిక దినోత్సవం అనేసుకునేవారు కాబోలు.
అది మాత్రమే కాదు.విమానాలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు పైలట్లు.
చెప్పిన ఓ పదం పేరే మే డే.మనలో చాలామంది ఓటీటీ లో రన్ వే-34 సినిమా చూసే వుంటారు.ఆ సినిమాలో హీరో అజయ్ దేవగన్.మే డే అనౌన్స్ చేసి. విపత్కర పరిస్థితుల్లో ఫ్లైయిట్ లాండింగ్ కు ప్రయత్నించడం చూసే వుంటారు.అసలు మే డే అంటే ఏంటి? దానికి ఏవియేషన్ కు ఏంటి సంబంధం? అనే విషయం చాలామంది మదిలో మెదిలే ప్రశ్న కదా.
విమాన ప్రయాణం అనేది అనేక సందర్భాల్లో చాలా రిస్కుతో కూడుకున్నది.వాతావరణం ప్రతికూలంగా వున్నా, లేక ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినా వేల అడుగుల ఎత్తులో ఎగిరే విమానం ప్రమాదంలో ఉన్నట్లే.
అలాంటప్పుడు విమానాలను ల్యాండ్ అవ్వాల్సిన ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ అవ్వకుండా ప్రత్యామ్నాయ విమానాశ్రయానికి మళ్లిస్తారు.ఒక్కోసారి విమానంలో ఇంధనం అయిపోతుంటే.కూడా దగ్గరలోని విమానాశ్రయంలో అత్యవసరంగా దించేందుకు ప్రయత్నిస్తారు.ఈ ప్రయత్నాల్లో ప్రమాదాలు ఎదురు కావొచ్చు.
మే డే అనేది విపత్కర పరిస్థితుల్లో ఉన్నాం.అని తెలిపే సమాచారం.

సింపుల్ గా చెప్పాలంటే ప్రాణాంతక పరిస్థితుల్లో ఉన్నాం అని చెప్పే అత్యవసర మెసేజ్ ఈ మే డే.అలాగే నౌకల్లో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తారు.మే డే అని మూడుసార్లు వరసుగా పలికిన తర్వాత తాము ఉన్న పరిస్థితిని వివరిస్తారు.అప్పుడు వారికి గ్రౌండ్ నుంచి అవసరం అయిన సమాచారం సాయం అందుతుంది.
అయితే మే డే అని చెప్పడానికి.ఓ నిర్థిష్టమైన విధానం అనుసరించాలి.
అన్ని సందర్భాల్లో మే డే చెప్పడానికి వీలులేదు.తీవ్ర అపాయం, ప్రాణాంతకం అయిన సందర్భాల్లో మాత్రమే దీనిని వాడాల్సి ఉంటుంది.
మే-డే అని మూడుసార్లు పైలట్ గట్టిగా పలకాల్సి ఉంటుంది.







