నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే ఈమె తెలుగు తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఇదివరకు తెలుగులో ఈమె నటించిన విరాటపర్వం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయినా ఈ సినిమాలో సాయి పల్లవి నటించిన వెన్నెల పాత్ర ద్వారా సాయి పల్లవికి ఎంతో మంచి గుర్తింపు వచ్చింది.
ఇకపోతే సాయి పల్లవి తమిళంలో నటించిన గార్గి సినిమా కూడా ఈనెల 15వ తేదీ విడుదలకు సిద్ధమైంది.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
సాయి పల్లవి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.హీరోయిన్ గా నటిగా ఎంత మంచి పేరు ఉన్న సొంత ఇమేజ్ రావాలంటే యాక్షన్ సినిమాలు తప్పకుండా చేయాలని ఎంతోమంది నటీమణులు నిరూపించారు.
ఇప్పటికే విజయశాంతి అనుష్క వంటి హీరోయిన్లు ఇలాంటి యాక్షన్ సినిమాలను చేసి వారికంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే ఆ హీరోయిన్ల బాటలోనే సాయి పల్లవి కూడా యాక్షన్ సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సాయి పల్లవి మాట్లాడుతూ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ కిల్ బిల్ తరహా కథ ఎవరైన చెప్తే అలాంటి సినిమా చేస్తానంటు తన మనసులో మాట బయట పెట్టారు.ఈ క్రమంలోనే ఈమెకు ఫుల్ లెన్త్ యాక్షన్ సినిమాలు కనుక వస్తే తప్పకుండా నటిస్తానని అలాంటి కథల కోసం తాను కూడా ఎదురు చూస్తున్నానని తెలియజేశారు.మరి సాయి పల్లవి కోసం అలాంటి యాక్షన్ సన్నివేశాలను తీయడానికి దర్శకులు ఎవరు ముందుకు వస్తారో తెలియాల్సి ఉంది.







