Insta Reels : ఇన్స్టా రీల్స్ కి, షార్ట్ వీడియోస్ కి ఇంత డిమాండ్ ఎందుకు ? 

సోషల్ మీడియా(Social Media) పురివిప్పి నాట్యం చేస్తున్న రోజులు ఇవి.ఎక్కడ, ఏ మూల ఏం జరిగినా కూడా అది సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది.

 Why People Addicting To Instagram Reels Youtube Shorts-TeluguStop.com

ప్రపంచం నలుమూలల ప్రతి విషయాన్ని అరచేతిలోకి తీసుకొచ్చే అంతర్జాలం సోషల్ మీడియాతో ఒక ఆట ఆడుతుంది.అందుకే పాలు తాగే పిల్లలు నుంచి 90 ఏళ్ల ముసలాడి వరకు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది.

స్మార్ట్ ఫోన్(Smartphone) ని మనం నొక్కుతున్నాము అనడం కన్నా అది మన జీవితాలతో ఆడుకుంటుంది అనడమే సరైన పద్ధతి.ఇక అసలు విషయానికి వెళ్తే, షార్ట్ వీడియోస్(Short Videos) లేదా రీల్స్(Reels)కి సోషల్ మీడియాలో ఎందుకు ఇంత నెటిజన్స్ అడిక్ట్ అవుతున్నారు అనేది పెద్ద ప్రశ్న.

మామూలు సోషల్ మీడియా తో పోలిస్తే ఈ మధ్య ఈ చిన్న వీడియోస్ కి డిమాండ్ బాగా పెరిగింది.

Telugu Busy, Reels, Netizens, Smartphone, Youtube-Technology Telugu

అటెన్షన్ స్పాన్ బాగా తగ్గిపోవడమే ఎందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది.కేవలం కొద్ది సమయంలోనే వందల వీడియోస్ చూసే అవకాశం రావడం మరొక ముఖ్యమైన కారణం.చెప్పవలసిన విషయాన్ని సూటిగా, సుత్తి లేకుండా, స్పష్టంగా చెప్పడం వల్ల నిమిషం పాటు చూసే వీడియోలకి డిమాండ్ అధికంగా ఉంది.

పైగా ఏ కారణం లేకుండా ఒకటి నుంచి 100 వరకు అంకెలను లెక్క పెట్టాలంటే కళ్ళు మూసుకొని నెమ్మదిగా లెక్కపెట్టడం జరిగే పని కాదు ఈ మధ్య గ్యాప్ లో మన మెదడులో అనేక విషయాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే మనం మెదడుకి ఒకచోట నిలిచి ఉండడం అనేది జరగదు.అందువల్ల ఒకే చోట ఉంటే శక్తి కూడా తగ్గిపోతుంది.

అందుకే తక్కువ టైంలో వచ్చే ఎంటర్టైన్మెంట్ ని ఎవరు వదులుకుంటారు చెప్పండి.

Telugu Busy, Reels, Netizens, Smartphone, Youtube-Technology Telugu

అలా ఫోకస్ గా చేయాలంటే చిన్న వీడియోలే మంచి అవకాశం.ఇక ఎవరైనా తీవ్ర అసంతృప్తితో లేదా అసహనంతో ఉన్నవారికి ఈ షార్ట్ రీల్స్ లేదా షార్ట్ వీడియోస్ చాలా మంచి రిలీఫ్ మెథడ్ అని చెప్పవచ్చు.మామూలుగా ఏదైనా విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే చాలా సమయం పడుతుంది పైగా జనాలకు ఇప్పుడు అంత సమయం లేదు అందుకే అన్ని త్వరగా జరిగిపోవాలి పైగా తక్కువ టైంలో జరగాలి అందుకే ఎమోషన్ కూడా తక్కువ సమయం ఫిల్ అయ్యేలా చేయడంలో ఈ రీల్స్ బాగా పనికి వస్తున్నాయి.

బిజీ షెడ్యూల్ లైఫ్(Busy Schedule)) లో ఇలాంటి చిన్న వీడియోస్ కి మాత్రమే పరిమితం కాకుండా మన క్రికెట్ విషయానికొస్తే మొదట్లో టెస్ట్ క్రికెట్ కి బాగా ప్రాముఖ్యత ఉండేది ఆ తర్వాత వన్డేలకు ఇప్పుడు టి20(T20)కి బాగా డిమాండ్ కనిపిస్తోంది చిన్న చిన్న బ్రేక్ లోనే ఈ మ్యాచ్లను చూడొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube